Begin typing your search above and press return to search.
మాల్యా అరెస్ట్..బెయిల్..ట్వీట్
By: Tupaki Desk | 18 April 2017 12:50 PM GMTలిక్కర్ బారన్, బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి దేశం వదిలి వెళ్లిపోయిన విజయ్ మాల్యా తన అరెస్ట్ - బెయిల్ పై విడుదలవడాన్ని లైట్ తీసుకున్నారు. అంతా ఇండియన్ మీడియా సృష్టేనని, భారత్ వేసిన ఎక్స్ ట్రాడిషన్ (అప్పగింత) కేసులో ముందుగా ఊహించినట్లే కోర్టులో ఇవాళ విచారణ మొదలైందని మాల్యా ట్వీట్ చేశారు. మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వెస్ట్ మినిస్టర్ కోర్టులో ఆయనను హాజరుపరచగా.. కోర్టు మాల్యాకు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆయనను వెస్ట్ మిన్ స్టర్ లోని కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టయిన మూడు గంటల్లోపే మాల్యాకు బెయిల్ దొరకడం గమనార్హం. మాల్యాను ఇండియాకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. తొందర్లోనే సీబీఐ టీమ్ లండన్ కు వెళ్లనుంది. మాల్యాను బ్యాంకులు ఇప్పటికే రుణ ఎగవేతదారుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 9 వేల కోట్లకుపైగా లోన్లు తీసుకున్న మాల్యా.. గతేడాది మార్చి 2న దేశం వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ లండన్ లోనే తలదాచుకుంటున్నారు. మాల్యాను భారత్ కు అప్పగించేందుకు ఈ మధ్యే బ్రిటన్ న్యాయ ప్రక్రియను మొదలుపెట్టింది. అయితే రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. మాల్యాను భారత్ కు అప్పగించడం అంత సులువుగా కనిపించడం లేదు. ఓ వ్యక్తిని భారత్ కు అప్పగించాలంటే ఆ వ్యక్తి బ్రిటన్ ను కొన్ని హామీలు కోరే అవకాశం ఈ ఒప్పందం ప్రకారం అతనికి కలుగుతుంది.
మనీ లాండరింగ్ కేసు ఎదుర్కొంటున్న మాల్యాపై.. ఇప్పటికే అనేక అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. భారత్ మాల్యా పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. ఆయన్ని వెంటనే దేశం నుంచి పంపించేయాల్సిందిగా కూడా భారత్ బ్రిటన్ ను కోరింది. అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పాస్ పోర్ట్ రద్దయినా.. అతను బ్రిటన్ లోనే ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు మాల్యా అరెస్ట్ పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. మోదీ అంటే ఇదీ అంటూ ప్రశంసించారు. మాల్యా జైలు కెళ్లాల్సిన టైమ్ దగ్గర పడిందని, ఆయన తర్వాత లలిత్ మోదీకీ ఇదే గతి పడుతుందని స్వామి ట్వీట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/