Begin typing your search above and press return to search.
అధికారుల్నే లండన్ కు రమ్మంటున్నాడు
By: Tupaki Desk | 21 July 2016 4:53 AM GMTలిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు. వేలాది కోట్ల రూపాయిల బకాయిల నేపథ్యంలో తన దారిన తాను గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటి వెళ్లిపోయి.. బ్రిటన్ లో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్న ఈ మొండి ఘటం తాజాగా అధికారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పలు కేసుల విషయంలో తనను విచారించాలని ఉత్సాహపడుతున్న అధికారులకు తాను ఇండియా రానని తెగేసి చెప్పటమే కాదు.. మీకు అవసరమైతే మీరే లండన్ కు రండి.. ఇంటర్వ్యూ ఇస్తానని తేల్చారు.
ఆటో స్పోర్ట్స్ అనే మీడియా సంస్థకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన అతగాడు.. భారత దర్యాప్తు సంస్థలు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పిన అతగాడు.. బకాయిలకు సంబంధించిన తనను విచారించాలని అనుకునే అధకారులు అయితే లండన్ కు రావాలని లేదంటే రేడియో కాన్ఫరెన్స్.. ఈమొయిల్ తో భారత్ అధికారులకు అవసరమైన సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తన బలుపును ప్రదర్శించారు. భారత దర్యాప్తు సంస్థలకు తనను వేధించటం కొత్త కాదన్నట్లుగా వ్యాఖ్యలు చేసిన ఆయన.. 1985లో కూడా తనను ఇదే రీతిలో వేధించినట్లుగా చెప్పారు. అప్పట్లో తాను నిర్దోషిగా బయటపడ్డానని గతం గురించి చెప్పుకున్న ఆయన.. తనపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటం.. దౌత్య పాస్ పోర్ట్ క్యాన్సిల్ చేయటం లాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఉదాహరణలు చెప్పుకొచ్చారు. బ్యాంకుల దగ్గర వేలాది కోట్లు ఎగ్గొట్టటమే కాదు.. ఏన్నేసి మాటలు అంటున్నాడో కదా.