Begin typing your search above and press return to search.

మాల్యాకు దిమ్మ‌తిరిగిపోయే షాకిచ్చిన ఈడీ

By:  Tupaki Desk   |   18 Sep 2017 5:15 PM GMT
మాల్యాకు దిమ్మ‌తిరిగిపోయే షాకిచ్చిన ఈడీ
X
జ‌ల్సాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారి భారీ స్థాయిలో అప్పులు చేసి బ్రిట‌న్‌ కు పారిపోయిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. 9వేల కోట్ల మేర అప్పులు చేసి బిచాణ ఎత్తేసిన మాల్యాకు సంబంధించిన ఆస్తుల‌ను రిక‌వరీ చేసే ప్ర‌య‌త్నం ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు ఆస్తుల‌ను వేలం వేసిన ఈడీ ఇప్పుడు మాల్యాకు అత్యంత ప్రీతిపాత్ర‌మైన యునైటెడ్ బ్రూవ‌రీస్‌ పై క‌న్నువేసింది. యూబీఎల్‌ కు చెందిన 4 కోట్ల వాటాలు - యూఎస్‌ ఎల్‌ కు చెందిన 25.1 లక్షల వాటాలు - మెక్‌ డోవెల్స్‌ హోల్డింగ్స్‌లోని 22 లక్షల వాటాలను ఇప్ప‌టికే అటాచ్ చేసుకున్న ఈడీ ఇప్పుడు బ్యాంకుల వ‌ద్ద తాక‌ట్టు లేని వాటిని సైతం వేటాడుతోంది.

నిబంధ‌నల ప్ర‌కారం....త‌గు ఆధారాలు చూపించి న్యాయ‌స్థానాల అనుమ‌తితో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చనిపోయిన సందర్భంలో గానీ, నేరస్తుడిగా గుర్తించిన సందర్భంలో గానీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. స‌రిగ్గా ఈ వెసులుబాటు ఆధారంగా మాల్యా ఆస్తుల‌ను కేంద్రానికి అటాచ్ చేయ‌డంలో భాగంగా బ్యాంకుల వ‌ద్ద తాక‌ట్టులో లేని వాటిపై ఈడీ దృష్టిపెట్టింది. ఈ క్ర‌మంలో దాదాపుగా రూ.4,000 కోట్ల విలువైన షేర్లు ఉంటాయని అంచనా వేస్తున్న యబీఎల్‌ - యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ - మెక్‌ డోవెల్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ల‌పై క‌న్నువేసింది. ఆయా సంస్థ‌ల్లో రూ.100 కోట్ల విలువైన వాటాలను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల‌ని కోరుతూ స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఈడీ లేఖ రాసింది. ఈ లేఖ‌కు అనుమ‌తి ద‌క్కితే మాల్యా ఆస్తులు కేంద్ర ప్ర‌భుత్వం ప‌రం కానున్నాయి.

మ‌రోవైపు ఈ కంపెనీతో పాటుగా మాల్యాకు సంబంధించిన‌ మ‌రికొన్ని సంస్థ‌ల‌కు సంబంధించిన ఆస్తుల‌పై కూడా ఈడీ క‌స‌రత్తు చేస్తోంది.యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌, మాల్యా ప్రైవేటు లిమిటెడ్‌, కింగ్‌ఫిషర్‌ ఫిన్‌వెస్ట్‌ ఇండియా - కామ్‌స్కో ఇండస్ట్రీస్‌ - ది గేమ్‌ - ఇన్వెస్ట్‌ మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీ - దేవీ ఇన్వెస్ట్‌ మెంట్స్‌ - ఫార్మాట్రేడింగ్‌ కంపెనీ - విట్టల్‌ ఇన్వెస్ట్‌ మెంట్స్ సైతం ఈడీ నిఘాలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇవి కూడా బ్యాంకుల తన‌ఖాలో లేనిప‌క్షంలో నిబంధ‌న‌ల ప్ర‌కారం వాటిని కేంద్రానికి అటాచ్ చేసే ప్ర‌క్రియ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు చెప్త‌న్నారు.