Begin typing your search above and press return to search.
మాల్యాపై కుట్ర జరుగుతోంది..బ్యాంకులే తప్పు చేశాయి
By: Tupaki Desk | 17 March 2018 8:21 AM GMTభారతీయ బ్యాంకులకు సుమారు 9 వేల కోట్లు ఎగవేసిన జల్సాలరాయుడు - లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విచారణ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. కోట్లు ఎగవేసిన మాల్యా ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మాల్యాను అప్పగించాలని బ్రిటన్‌ను భారత్ అభ్యర్థించింది. ఆ కేసులో భాగంగా జరిగిన విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ మాల్యా అప్పగింత కేసుపై శుక్రవారం లండన్ లోని వెస్ట్ మిన్ స్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. మాల్యా ఎగవేత కేసును పరిశీలిస్తున్న ఆ కోర్టు న్యాయమూర్తి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కింగ్ ఫిషర్ అధినేత మాల్యాకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులే నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోందని జడ్జి ఎమ్మా ఆర్బుత్నాట్ తెలిపారు. ముక్కలు ముక్కలుగా ఉన్న కేసు ఇప్పుడిప్పుడు ఒక దగ్గరకు వస్తున్నదని, ఇప్పుడిప్పుడే తనకు ఆ కేసు అర్థమవుతోందన్నారు. భారతీయ బ్యాంకులు స్వంత నిబంధనలను ఉల్లంఘించాయన్న విషయం తనకు ఇప్పుడే తెలుస్తోందని ఆమె అన్నారు. భారతీయ బ్యాంకులు దీని పట్ల వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె అన్నారు. మాల్యాపై కుట్ర జరుగుతుందన్న కోణం అందులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.