Begin typing your search above and press return to search.
కాఫీ తాగించినోడు చనిపోయాడు..మందు తాగించినోడు పారిపోయాడు!
By: Tupaki Desk | 1 Aug 2019 2:30 PM GMTగడిచిన మూడు రోజులుగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ కేఫ్ కాఫీడే సీఎండీ వీజీ సిద్దార్థ గురించిన సమాచారంతో హోరెత్తుతోంది. అప్పుల బాధతో.. కొన్ని ప్రభుత్వ శాఖల ఒత్తిళ్లను అధిగమించలేదు.. అందరికి సారీ చెప్పేసి సూసైడ్ చేసుకున్న సిద్ధార్థ తీరుపై సానుభూతి పొంగిపొర్లుతోంది. ఈ వ్యవహారంపై ఎవరికి వారు తమకు తోచినట్లు రియాక్ట్ అయ్యారు. సిద్దార్థను ఆరాధించి.. ప్రేమించినోళ్లంతా ఆయన మరణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోగా.. ఇలాంటి వాటికే కుంగిపోతే ఎలా? ఇలాంటి సమయాల్లోనే కదా నిలబడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. సిద్దార్థ ఉదంతాన్ని తనకు తాను అన్వయించుకొని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నిన్న చేసిన ట్వీట్ వైరల్ కావటమే కాదు.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెర తీసింది. తనది సిద్దార్థ లాంటి పరిస్థితేనని.. తాను తీసుకున్న అప్పును చెల్లిస్తానని చెప్పినా.. బ్యాంకులు స్పందించటం లేదని.. అప్పు కట్టేస్తానన్నా సహకరించటం లేదన్న మాటను ఆయన ఆవేదనగా చెప్పేస్తున్నారు. ఆయన అప్పు తీర్చటంపై విషయాలు ఎలా ఉన్నా.. ఆయన తనను తాను సిద్దార్థతో పోల్చుకోవటాన్ని మాత్రం చాలా మంది అంగీకరించటం లేదు.
మాల్యా మాటలపై పంచ్ లు వేస్తున్నారు. అలాంటి పంచ్ లలో అదిరిపోయే పంచ్ మాత్రం ఇదేనని చెప్పాలి. కాఫీ తాగించినోడు చనిపోయాడు.. మందు తాగించినోడు మాత్రం పారిపోయాడని. విన్నంతనే నిజమే కదా? అనిపించే ఈ మాటల్నే తీసుకుంటే.. కాఫీ తాగించి.. తనకు ఎదురైన అప్పుల్ని సిద్దార్థ ఎగ్గొట్టాలని ప్రయత్నించలేదు.. ఏదో ఒక ప్రయత్నం చేసి తీర్చాలనుకున్నాడు. అయితే.. అందుకు స్వార్థపూరిత వ్యవస్థ ఆయన్ను రాచి రంపాన పెట్టింది. ఎన్నో ఎదురుదెబ్బలు తిని తట్టుకున్నోడు.. దీన్ని కూడా తట్టుకొని ఉండి ధీటుగా సమాధానం చెబితే.. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి దాతగా నిలిచేవారు. కానీ.. ఆయన ఆ విషయంలో ఎందుకో బ్యాలెన్స్ తప్పారు.
ఇక.. మాల్యా విషయానికి వస్తే.. ఆయన అమ్మింది లిక్కర్. ఆయన అప్పుల పాలు కావటానికి సగం కారణం.. ఆయన విలాసాలు.. విలాసవంతమైన జీవితమన్న విషయాన్ని మర్చిపోకూడదు. బ్యాంకుల్ని బురిడీ కొట్టించటం.. వారిపై ఒత్తిడి తీసుకురావటం ద్వారా వేలాది కోట్ల రూపాయిల్ని వెనకేసుకొని..వేరే ఆలోచన లేకుండా లండన్ కు చెక్కేసిన పెద్ద మనిషి.. ఈ రోజు నీతులు చెప్పటం విశేషం. ఒకరు వ్యవస్థ చేస్తున్న దాడిని తట్టుకోలేక.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. తనను తాను చంపుకుంటే.. మాల్యా లాంటోళ్లు వ్యవస్థను లూటీ చేసి తన దారిన తాను పారిపోయి.. విలాసవంతంగా బతుకుతున్న విషయాన్ని మర్చిపోలేం. నిజానికి ఇద్దరు చేసే వ్యాపారాలకు తగ్గట్లే వారి మైండ్ సెట్లు ఉన్నాయని చెప్పక తప్పదు. నిజమే.. కాఫీని ఏ రోజూ మందుతో పోల్చలేం కదా? ఈ రెండు ఎప్పటికి ఒక్కటి కావు కదా? అలానే.. వారిద్దరు కూడా.