Begin typing your search above and press return to search.
మాల్యాకు తొలి షాకిచ్చిన లండన్ కోర్టు
By: Tupaki Desk | 10 Dec 2017 4:22 AM GMTవేలాది కోట్ల రూపాయిలు బ్యాంకుల వద్ద అప్పులు తీసుకొని తన దారిన తాను పోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు తొలిసారి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రూ.9వేల కోట్ల రూపాయిల బకాయిల్ని ఎగ్గొట్టి దేశం నుంచి పారిపోయి బ్రిటన్ లో తలదాచుకుంటున్న మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ కోరటం తెలిసిందే.
దీనికి సంబందించి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల నేపథ్యంలో ఇప్పటికి రెండుసార్లు లండన్ లో అరెస్ట్ అయిన మాల్యా క్షణాల వ్యవధిలో రిలీజ్ కావటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా కోరుతూ భారత్ లండన్ కోర్టును ఆశ్రయించింది. ఈ విచారణకు ఒక రోజు ముందు మాల్యాకు ఊహించని షాక్ ఒకటి తగిలిన విషయం తాజాగా బయటకు వచ్చింది. బ్రిటన్ లోని ఆయన ఆస్తుల్ని స్తంభింపచేస్తున్నట్లుగా లండన్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు.. వారానికి ఆయనకు అయ్యే ఖర్చులకు సంబంధించి రూ.4లక్షలు మాత్రమే నిధులు విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.దీంతో.. ఇష్టం వచ్చినట్లుగా మాల్యా ఖర్చు చేయటానికి అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే.. కోర్టు నిర్ణయాన్ని విభేదించిన మాల్యా.. తనకు వారం ఖర్చుల కోసం రూ.16 లక్షలు నిధులు విడుదల అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు మాత్రం ఆయన వినతిని తిరస్కరించినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే లండన్ లో మాల్యా ఆస్తులకు సంబంధించి బ్యాంకులు కొన్ని వివరాల్ని వెల్లడించాయి. అత్యంత ఖరీదైన మూడు ఆస్తులు.. కార్లు.. ఇతర విలువైన ఆస్తులు మాల్యాకు ఉన్నట్లుగా పేర్కొన్నారు. 11.5 మిలియన్ యూరోలు విలువ చేసే లేడీ వాక్ ఎల్ ఎల్ పీ కంపెనీ ఉన్నట్లుగా బ్యాంకులు వెల్లడించాయి.
ఇవే కాక 2005లో మాల్యా లండన్ లో 5.5 మిలియన్ యూరోలు విలువ చేసే ఆస్తుల్ని కొన్నట్లుగా బయటకు వచ్చింది. రెండు ఓడులు కూడా ఉన్నట్లు బ్యాంకులు వెల్లడించాయి. ఇన్ని ఆస్తులు ఉన్నప్పుడు మాల్యా ఎందుకు తన బకాయిల్ని తీర్చరు? అన్నది అసలు ప్రశ్న. ఈ ఆస్తులపై నియంత్రణ విధించటంతో పాటు.. వారానికి అయ్యే ఖర్చుకు సంబంధించిన పరిమిత మోతాదులో మాత్రమే నిధులు ఇవ్వాలంటూ లండన్ కోర్టు పెట్టిన ఆంక్షలు మాల్యాకు మొదటి ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.