Begin typing your search above and press return to search.
'ఇండియా' ను వద్దన్న విజయ్ మాల్యా!
By: Tupaki Desk | 29 Jun 2017 12:23 PM GMTఇండియాలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు పంగనామం పెట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఇండియా అనే పేరు నచ్చడం లేదట. ఎటూ మాల్యాకు ఇప్పట్లో ఇండియాకు తిరిగి వచ్చే ఉద్దేశం లేదు గనుక తన ఫార్ములా వన్ జట్టు ఫోర్స్ ఇండియా నుంచి ఇండియాను తొలగించాలని నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే తన జట్టు పేరును ఫోర్స్ వన్ అని మార్చబోతున్నాడట.
ఇప్పటికే ఫోర్స్ వన్ పేరు మీద ఆరు సంస్థలను రిజిష్టర్ చేశాడు మాల్యా. ఆ సంస్థలన్నింటికీ తిరువన్నామలై లక్ష్మీ కాంతన్ ను డైరెక్టర్‌గా నియమించాడు. ఫోర్స్ ఇండియా బోర్డు డైరెక్టర్లలో కాంతన్ ఒకరు. ఆయన చాలా కాలం నుంచి మాల్యా ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్నారు.
మరింతమంది గ్లోబల్ పార్ట్ నర్స్ ను ఆకర్షించడానికే పేరు మార్చామని ఫోర్స్ ఇండియా సీవోవో ఒట్మాన్ జాఫ్ నర్ తెలిపారు. ఫోర్స్ ఇండియాకు స్పాన్సర్ చేయడానికి భారత్ నుంచి తక్కువ కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. ఫోర్స్ ఇండియాలో మాల్యాకు 42.5% - సహారా గ్రూపునకు 42.5% - డచ్ వ్యాపారవేత్తకు 15% వాటా ఉందని తెలిపారు. ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/