Begin typing your search above and press return to search.

మాల్యా ఎక్కడున్నా ఆర్సీబీ ధ్యాసే!

By:  Tupaki Desk   |   7 May 2019 11:45 AM GMT
మాల్యా ఎక్కడున్నా ఆర్సీబీ ధ్యాసే!
X
విజ‌య్ మాల్యా.. ఇండియ‌న్ లిక్క‌ర్ కింగ్‌. ఇప్పుడు కాదులెండి. గ‌తంలో లిక్క‌ర్ కింగ్ అనేది మాల్యాల‌కు జ‌నం ముద్దుగా పెట్టుకున్న పేరు. వ్యాపారంలో త‌న‌దైన శైలి వ్యవ‌హారంతో అంద‌రి దృష్టిని ఇట్టే ఆక‌ట్టుకున్న మాల్యా... బ్యాంకుల వ‌ద్ద తీసుకున్న అప్పులు ఎగ్గొట్టి ఎప్పుడైతే విదేశాల‌కు పారిపోయారో... అప్పుడే ఆయ‌న ఇమేజీ మొత్తం డ్యామేజీ అయిపోయింది. లిక్క‌ర్ కింగ్ పేరుకు బ‌దులుగా డిఫాల్ట‌ర్‌గా ఆయ‌నకు ఇప్పుడు ముద్ర ప‌డిపోయింది. త‌న బిజినెస్ ఉచ్ఛ స్థితి నుంచి అధోఃగ‌తికి ప‌డిపోతున్న ద‌శ‌లో... త‌న క‌ష్టాలు చావ‌ల‌ని, ఏకంగా ఐపీఎల్ లో ఓ జ‌ట్టునే కొనేశారు. దానికి త‌న లిక్క‌ర్ కంపెనీ పేరు వ‌చ్చేలా బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ అనే పేరు పెట్టారు. త‌న ద‌ర్పానికి త‌గ్గ‌ట్టుగా ఆ జ‌ట్టుకు టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీని కెప్టెన్ గా నియ‌మించుకున్నాడు.

అయితే మాల్యా ఈ జ‌ట్టుపై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ అడియాశ‌లుగానే మారిపోయాయి. కోహ్లీ స్టార్ క్రికెట‌ర్ హోదా నుంచి కెప్టెన్ గా ఎదిగాడు గానీ... ఆర్సీబీ జ‌ట్టును మాత్రం విజ‌య‌ప‌థంలో న‌డిపించ‌లేక‌పోయారు. దీనిపై ఏనాడూ ప‌ల్లెత్తు మాట కూడా అన‌ని మాల్యా... ఇప్పుడు స‌హ‌నం న‌శించిందేమో తెలియ‌దు గానీ... జ‌ట్టుపైనే కాకుండా కోహ్లీ సామ‌ర్థ్యంపైనా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ -12 సీజ‌న్ లీగ్ ద‌శ‌ను దాటేసి ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. ఈ సారి కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ ను కూడా ద‌క్కించుకోలేక‌పోవ‌డంతో పాటుగా పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానంలో నిలిచింది. ఈ త‌ర‌హాలో కోహ్లీ జ‌ట్టు అంచ‌నాలు అందుకోలేక‌పోయిన వైనం మాల్యాను బాగానే క‌ల‌త‌కు గురి చేసిన‌ట్టుంది.

వెంట‌నే ట్విట్ట‌ర్ లో ప్ర‌త్య‌క్ష‌మైపోయిన మాల్యా... ఆర్సీబీపై సంచ‌ల‌న కామెంట్ చేశారు. ఆర్సీబీ స‌త్తా క‌లిగిన లైన‌ప్ ను క‌లిగి ఉంది కానీ.. అదంతా పేప‌ర్ పైనే నంటూ అదిరిపోయే కామెంట్ సంధించారు. ఈ ఒక్క కామెంట్ తో ఆర్సీబీ జ‌ట్టుపై త‌న‌కు ఎలాంటి అభిప్రాయం ఉందో ఆయ‌న ఇట్టే చెప్పేశారు. ఈ సీజ‌న్ లో మెరుగ్గా రాణించ‌లేక‌పోయినందుకు కెప్టెన్ కోహ్లీతో పాటు స్టార్ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ కూడా అభిమానుల‌కు సారీ చెప్పేస్తే.. మాల్యా మాత్రం త‌న‌దైన పంచ్ డైలాగ్ తో జ‌ట్టుకు షాకిచ్చారు. మాల్యా కామెంట్ ఇప్పుడు పెద్ద ర‌చ్చే చేస్తోంది.