Begin typing your search above and press return to search.

బ్యాంకుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మాల్యా

By:  Tupaki Desk   |   10 March 2017 10:53 AM GMT
బ్యాంకుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మాల్యా
X
సాధార‌ణంగా అప్పు తీసుకునే వారి విష‌యంలో బ్యాంకుల ద‌య‌త‌లుస్తుంటాయి .కానీ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా విషంయ‌లో సీన్ రివ‌ర్స్ అయింది. బ్యాంకుల విష‌యంలో మాల్యానే క‌నిక‌రం చూపించాడు మ‌రి! రూ. 9 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోవ‌డంతో బ్యాంకులు ల‌బోదిబోమంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే స‌ద‌రు బ్యాంకుల‌కు మంచి ఆఫర్ ఒక‌టి ఇచ్చాడు మాల్యా. వన్ టైం సెటిల్ మెంట్ కింద బ్యాంకు రుణాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మాల్యా తెలిపాడు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో వన్ టైం సెటిల్ మెంట్ కు విధానాలు ఉన్నాయని, వందలాది మంది రుణగ్రహీతలు ఇలా సెటిల్ మెంట్ చేసుకున్నారని విజయ్ మాల్యా ట్వీట్ చేశాడు. అందుకే త‌న అప్పుల విష‌యంలో వ‌న్ టైం సెటిల్ మెంట్ కోసం బ్యాంకులతో మాట్లాడడానికి సిద్ధమేనని ప్ర‌క‌టించాడు.

అయితే ఇన్నాళ్లుగా ఎన్ని ప్ర‌య‌త్నాలు సాగిన‌ప్ప‌టికీ లైట్ తీసుకున్న మాల్యా ఇప్పుడే ఎందుకు రియాక్ట‌య్యాడు అనే విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం వ‌స్తోంది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో విచారణకు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా అన్ని వైపుల నుంచీ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవ‌లే నేర‌స్తుల అప్ప‌గింత ఒప్పందాన్ని బ్రిట‌న్‌ తో భార‌త్ కుద‌ర్చుకున్న‌ది. దీంతో త్వ‌ర‌లో లండ‌న్‌ లో నివ‌సిస్తున్న మాల్యా చేతికి బేడీలు ఖాయ‌మ‌ని వార్త‌లు వెలువ‌డుతున్న స‌మ‌యంలో ఆయ‌న ఈ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కాగా, పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాల్యా ఉదంతాన్ని ప్ర‌స్తావించారు. మద్యం వ్యాపారి మాల్యా వంటి వారు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా చేయడానికి చట్టాలను పరిపుష్టం చేయాల్సి ఉందని చెప్పారు. ఉన్న చట్టాల్లో మార్పులు తీసుకురావడం కాని, కొత్త చట్టాలు రూపొందించడం కాని చేయాల్సి ఉందని, దానికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని ఆయన లోక్‌ సభలో చెప్పారు. రుణ ఎగ‌వేత‌దారుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/