Begin typing your search above and press return to search.

అప్పులుంటే బికినీ బొమ్మ‌లు వ‌దిలేయ‌రుగా!

By:  Tupaki Desk   |   5 Jan 2018 10:26 AM GMT
అప్పులుంటే బికినీ బొమ్మ‌లు వ‌దిలేయ‌రుగా!
X
అప్పులు ఉంటే మాత్రం తిన‌టం మానేస్తామా? ప‌డుకోకుండా ఉండ‌టం మానేస్తారా? మామూలోడి ప‌రిస్థితే ఇలా ఉంటే మాల్యా మాత్రం ఎందుకు త‌గ్గుతాడు చెప్పండి. బ్యాంకుల ద‌గ్గ‌ర వేల కోట్లు అప్పులు తీసుకొని.. వాటిని క‌ట్ట‌కుండా గుట్టుచ‌ప్పుడు కాకుండా దేశం విడిచిపోతే మాత్రం తాను ఎప్ప‌టినుంచో చేసే ప‌నుల్ని వ‌దిలేస్తాడా ఏంది? ల‌ండ‌న్ శివారుల్లోని గ్రామంలో రాజ ప్రాసాదం లాంటి కోట లాంటి ఇంట్లో హ్యాపీగా సేద తీరుతున్న ఆయ‌న.. లీగ‌ల్ టెన్ష‌న్లు ఎన్ని ఉన్నా.. తాను రెగ్యుల‌ర్ గా త‌యారు చేయించే బికినీ భామ‌ల క్యాలెండ‌ర్ ను మాత్రం వ‌దిలిపెట్ట‌లేదు.

కోర్టు కేసుల‌తో పాటు..ఏ చిన్న అవ‌కాశం చిక్కినా భార‌త్‌ కు ర‌ప్పించి జైల్లో ప‌డేలాయ‌న్నట్లుగా భార‌త్ సర్కారు ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ప్ప‌టికీ.. త‌న క్యాలెండ‌ర్ రిలీజ్ విష‌యంలో మాత్రం బ్రేక్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుక‌న్నారు. స్యూయిర్ వ‌స్తుందంటే.. ఏ కంపెనీకి ఆ కంపెనీ క్యాలెండ‌ర్లు.. డైరీలు విడుద‌ల చేయ‌టం మామూలే.

కానీ.. విజ‌య్ మాల్యా విడుద‌ల చేసే బికినీ భామ‌ల క్యాలెండ‌ర్ కోసం దేశీయంగానే కాదు అంత‌ర్జాతీయంగా కూడా ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతుంటోంది. ఎందుకంటే.. కింగ్ ఫిష‌ర్ బ్రాండ్ మీద విడుద‌ల‌య్యే క్యాలెండ‌ర్‌ కు ఉన్న ఇమేజ్‌ కు త‌గ్గ‌ట్లే.. బికినీ భామ‌ల ఎంపిక మొద‌లు ఫోటో షూట్ వ‌ర‌కూ చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఈ ఏడాది కింగ్ ఫిష‌ర్ నుంచి బికినీ భామ‌ల‌తో క్యాలెండ‌ర్ వస్తుందా? రాదా? అన్న సందేహం ఉంది. దీన్ని తీరుస్తూ.. క్యాలెండ‌ర్ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఎప్ప‌టి మాదిరే హాట్ హాట్ ఆందాల‌తో అదిరిపోయేలా క్యాలెండ‌ర్ ను త‌యారు చేయించిన త‌న మార్క్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌రోసారి ఫ్రూవ్ చేశారు మాల్యా.