Begin typing your search above and press return to search.

హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించనున్న మాల్యా !

By:  Tupaki Desk   |   5 May 2020 8:30 AM GMT
హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించనున్న మాల్యా  !
X
లిక్కర్ కింగ్ , వ్యాపారవేత్త విజయ్ మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాడు... అయితే భారత్ సుప్రీం కోర్టు కాదు ..యూకే సుప్రీం కోర్టు. భారతదేశం లో బ్యాంకులకు రూ.9 వేల కోట్ల ఎగనామం పెట్టి లండన్ ‌లో కొద్ది రోజులుగా ఉంటున్న విజయ్ మాల్యాని ఎలాగైనా ఇండియా కి తీసుకు రావాలని భారత బ్యాంకులను మోసం చేసిన కేసులో తమకు అప్పగించాలని ఇండియా యూకే ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి కోర్టులో పిటిషన్ వేసిన మాల్యాకు చుక్కెదురైంది. మాల్యాను భారత్ అప్పగించేందుకు హైకోర్టు అంగీకరించడం తో. ..ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మాల్యా భావిస్తున్నాడు.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్ల రుణాన్ని మాల్యా తీసుకున్నారు. దీనిపై యూకే హైకోర్టులో భారత్ ‌కు అనుకూలంగా తీర్పువచ్చింది. భారత్ ‌కు అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో.. దానిని సవాల్ చేసేందుకు మాల్యాకు 14 రోజుల సమయం ఉంది. సుప్రీంకోర్టు మెట్లెక్కి తప్పించుకోవాలని చూస్తున్నారు. కేసు సుప్రీంకోర్టుకు చేరనుండటంతో ఫలితం కోసం యూకే హోం మంత్రిత్వశాఖ చూస్తోంది.

వాస్తవానికి మే 14వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే సమయం మాల్యాకు ఉంది. సుప్రీం తీర్పును బట్టి యూకే హోంశాఖ చర్యలు తీసుకోనుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకొని పారిపోయిన మాల్యా.. 2016లో బ్రిటన్‌లో కనిపించారుఅయితే మాల్యా మాత్రం తాను రూ.900 కోట్లు మాత్రమే రుణం తీసుకున్నానని.. రూ.9 వేల కోట్లు కాదని చెబుతున్నారు. 2009లో ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నానని చెప్తున్నాడు.