Begin typing your search above and press return to search.
ఒకే వేదికపైకి కోహ్లీ, మాల్యా...కొత్త వివాదం
By: Tupaki Desk | 6 Jun 2017 3:49 PM GMTలిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కారణంగా బ్యాంకుల వారే కాకుండా భారతీయ క్రికెటర్లు సైతం ఇరకాటంలో పడిపోతున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ లిక్కర్ కింగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. అది కూడా కోహ్లీ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమానికి మాల్యా రావడం వల్ల. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్న కోహ్లీ తనతో కలిసి పనిచేస్తున్న జస్టిస్ అండ్ కేర్ అనే సంస్ధ 'ఛారిటీ డిన్నర్' కార్యక్రమానికి హాజరయ్యారు. తోటి ఆటగాళ్లయిన రోహిత్ శర్మ - యువరాజ్ సింగ్ - అశ్విన్ - శిఖర్ ధావన్ - దినేశ్ కార్తీక్ - కేదార్ జాదవ్ లతో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం హాజరయ్యారు.
అలాన్ విల్కిన్స్ నిర్వహించిన ఛారిటీ ఈవెంట్ కు వ్యాఖ్యతగా ఐర్లాండ్ అంతర్జాతీయ క్రికెటర్ నిఆల్ ఓ బ్రెయిన్ వ్యవహరించారు. అయితే కార్యక్రమానికి క్రికెటర్లు హాజరుకాగా అదే వేడుకకు మాల్యా హాజరయ్యారు. దీంతో ఇండియన్ టీం ఇబ్బంది పడ్డట్లు సమాచారం. అదే సమయంలో ఈ కార్యక్రమం ఫొటోలు నెట్లో ప్రచారం అయి రచ్చరచ్చగా మారడంతో బీసీసీఐ వివరణ ఇచ్చింది. మాల్యాతో బీసీసీఐకి ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పింది. చారిటీ కార్యక్రమంలో టేబుల్ బుక్ చేసుకోవడం వల్ల మాల్యా అక్కడికి వచ్చి ఉంటారని, ఈవెంట్ నిర్వాహకులే ఈ విషయంలో బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.
ఇదిలాఉండగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను విజయ్ మాల్యా తిలకించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై మాల్యా వివరణ ఇచ్చారు.చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే అన్ని మ్యాచ్ లను చూస్తానని వ్యాపారవేత్త విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. టీమిండియాను చీర్ చేసేందుకు ఆ టీమ్ ఆడే అన్ని మ్యాచ్ లకు హాజరు కానున్నట్లు మాల్యా ట్వీట్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీపైన ప్రశంసలు కురిపించారు. మరోవైపు వీఐపీ స్టాండ్స్‌లో కూర్చున మాల్యాను సునీల్ గవాస్కర్ కూడా కలిశారు. కాగా, భారతీయ బ్యాంకులకు సుమారు తొమ్మిది వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/