Begin typing your search above and press return to search.
ట్రంప్ దగ్గర మ్యాల్యా ఫ్లాట్లు కొన్నాడా?
By: Tupaki Desk | 22 April 2016 7:18 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలని తెగ ప్రయత్నిస్తున్న డోనాల్డ్ ట్రంప్ పెద్ద పారిశ్రామిక వేత్త అన్న విషయం తెలిసిందే. ఆయనకున్న వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. ఆయనకు చెందిన ఒక ప్లాజాలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రెండు ఫ్లాట్లు.. ఒక పెంట్ హౌస్ కొనుగోలు చేసినట్లుగా ఒక కథనం బయటకు వచ్చింది. తనకున్న ఆస్తుల గురించి బ్యాంకులకు చెప్పాల్సిన అవసరం లేదంటూ తలపొగరు స్టేట్ మెంట్ తో కోర్టుకు మాల్యా చెప్పటం తెలిసిందే.
ఇదే సమయంలో.. ఇప్పటివరకూ బయటకు రాని మాల్యా ఆస్తుల వివరాలు తాజాగా వెల్లడి కావటం ఆసక్తికరంగా మారింది. 2010లో వీటిని కొనుగోలు చేశారని.. రాజ్యసభ అభ్యర్థిగా తన నామినేషన్లో ఈ ఆస్తుల వివరాల్ని మాల్యా వెల్లడించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లోని ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్లో ఈ ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు.
ట్రంప్ ప్లాజా పేరు మీదున్న అపార్ట్ మెంట్లో మాల్యా కుమార్తె తాన్యా పేరు మీద రెండు ఫ్లాట్లను సుమారు రూ.14 కోట్లకు పైనే ఖర్చు చేసి కొనుగోలు చేశారని.. మరో రూ.15.9కోట్లు ఖర్చు చేసి ఒక పెంట్ హౌస్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ బయటకు రాని ఈ ఆస్తుల గురించి వివరాలు బయటకు వచ్చిన నేపథ్యంలో మాల్యా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఓపక్క తన ఆస్తుల గురించి తనకు అప్పులిచ్చిన బ్యాంకులకు వివరాలు చెప్పనంటూ పెడసరంగా మాట్లాడుతున్న మాల్యాకు షాకిచ్చేలా ఆయనకు చెందిన ఆస్తుల వివరాలు (ఇప్పటివరకూ బయట పెట్టని) బయటకు రావటం గమనార్హం.