Begin typing your search above and press return to search.
మాల్యా విమానాల వేలం..ఎంత వచ్చిందంటే?
By: Tupaki Desk | 21 Sep 2018 5:49 AM GMTవేల కోట్ల రూపాయిల రుణాల్ని బ్యాంకుల దగ్గర దర్జాగా తీసుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. ఎంచక్కా దేశం నుంచి దర్జాగా బ్రిటన్ కు వెళ్లిపోయి హ్యాపీగా కాలం గడిపేస్తున్న సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయిల్ని రుణాలుగా తీసుకొని బ్యాంకులను ముంచేస్తున్న ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఇలాంటివేళే.. మాల్యా దేశం నుంచి వీడిపోవటానికి ప్రధాన కారణం ఎవరన్న ప్రశ్నకు.. మోడీ సర్కారులోని పెద్ద మనుషులన్న మాట ఇప్పుడు వినిపించటమే కాదు.. వేలెత్తి చూపించే ఆధారాలు లభిస్తున్న పరిస్థితి.
ఇదిలాఉంటే.. వేల కోట్లను తీసుకొని.. వాటిని తీర్చకుండా జంప్ అయిన మాల్యాకుచెందిన పలు ఆస్తులు దేశంలో ఉన్నాయి. అలాంటి ఆస్తుల్లో ఆయనకు చెందిన రెండు వ్యక్తిత హెలికాఫ్టర్లను తాజాగా వేలం వేశారు. ఎయిర్ బస్ యూరో కాఫ్టర్ బీ155 చాపర్లను రెండింటిని వేలం వేశారు. ఒక్కొక్కటి రూ.4.37 కోట్లు విలువ ఉంటుందని చెప్పే ఈ హెలికాఫ్టర్లు ఐదు సీట్లు ఉంటాయి. దాదాపు పదేళ్లు పాతవైనప్పటికీ ఈ చాపర్లు పనితీరు భేషుగ్గా ఉందని చెప్పక తప్పదు.
ప్రస్తుతం కండీషన్ బాగున్న ఈ చాపర్లను బెంగళూరులోని డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ బ్యాంకుల కన్సార్టియం వేలం వేసింది. ఈ రెండు చాపర్లను ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ కొనుగోలు చేసింది. 2008లో తయారుచేసిన ఈ హెలికాఫ్టర్లు చివరగా 2013లో ఎగిరాయి. ఆ తర్వాత వీటిని వాడటం మానేశారు.
తాజాగా వేసిన వేలంలో ఒక్కొక్క చాపర్ రూ.1.75 కోట్ల బిడ్డింగ్ ను స్టార్ట్ చేయగా.. చివరకు రూ.4.37 కోట్లకు చౌదరి ఏవియేషన్ ఫెసిటిలీ సంస్థ సొంతం చేసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ వేలం కార్యక్రమానికి మీడియాను పిలవకుండానే పూర్తి చేసేసి.. అంతా అయిపోయాక ఒక ప్రెస్ రిలీజ్ ముఖాన పడేసినట్లుగా చెబుతున్నారు. అదేదో.. మీడియా ముఖంగా వ్యవహారాన్ని పూర్తి చేస్తే బాగుండేదేమో?