Begin typing your search above and press return to search.
భారత్ కు రాకుండా తప్పించుకుంటున్న మాల్యా
By: Tupaki Desk | 26 Jun 2020 12:50 PM GMTభారత దేశం రాకుండా ఇంగ్లండ్ లో ఉంటూ లిక్కర్ కింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా దాగుడుమూతలు ఆడుతున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ తప్పించుకుంటున్నారు. ఒకవైపు విజయ్ మాల్యా, మరోవైపు మొత్తం భారత్ ప్రయత్నిస్తున్నా ఈ పంచాయితీ తెగడం లేదు. మాల్యా చేసిన ఆర్థిక నేరాలకి శిక్ష విధించేందుకు అతన్ని తిరిగి తీసుకురావడానికి భారతదేశం ఇంకా కష్టపడుతోంది.
ప్రస్తుతం, భారత ప్రభుత్వంతోపాటు భారత బ్యాంకులు కూడా విజయ్ మాల్యాను కార్నర్ చేయడానికి తాజాగా మారోసారి యుకె కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతి కోసం మాల్యా దరఖాస్తును హైకోర్టు తిరస్కరించినప్పటికీ, ఇంకా భారత్ కు రాకుండా లండన్లో మాల్యా ఉంటున్నారు.
మాల్యా న్యాయవాదులు యుకెలో చాలా బలంగా ఉన్నారు. మాల్యాను అప్పగించే కేసులో భారతదేశం గెలిచినప్పటికీ, యుకె హోమ్ ఆఫీసులో ఫైలు చిక్కుకుపోయింది. దీంతో మాల్యా భారత్ రాక నిలిచిపోయింది.
మాల్యా భారత్ కు రాకుండా దొరికిన న్యాయ అవకాశాలను వాడుకుంటూ ఇంగ్లండ్ నుంచి రావడం లేదు. అతను తన ఆస్తులను కూడా చాకచక్యంగా కాపాడుకుంటూ విక్రయిస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా క్రైసిస్ ను బాగా వాడుకుంటూ బ్రిటన్లో మరికొంత కాలం ఉండేందుకు మాల్యా స్కెచ్ గీశాడు.