Begin typing your search above and press return to search.
మాల్యా ఇండియాకి రావట్లేదట ...క్లారిటీ ఇచ్చిన పీఏ !
By: Tupaki Desk | 4 Jun 2020 6:30 AM GMTవిజయ్ మాల్యా ..ఈ పేరు తెలియని ఇండియన్ ఉండరు.మనదేశంలో వివిధ బ్యాంకుల వద్ద రూ.9,961 కోట్లు రుణంగా తీసుకుని తిరిగి చెల్లించకుండా, ఆపై దివాలా తీసి లండన్ కు ఎగిరిపోయిన మాల్యా అక్కడ ఓ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక మాల్యాను భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే లండన్ కోర్టు మాల్యాను నేరస్తుడిగా నమ్ముతూ భారత్ కు అప్పగించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. మాల్యాను తిరిగి భారత్ కు రప్పించే క్రమంలో న్యాయప్రక్రియ ముగిసినందున ఇక ఏక్షణమైనా భారత్ కు వచ్చే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వార్త నిన్న తెగ వైరల్ అయ్యింది.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మాల్యా పీఏ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే మాల్యా భారత్ కు వెళుతున్నారా అనే విషయంపై క్లారిటీ తీసుకునేందుకు ఆయన లాయర్ ఆనంద్ దూబేకు పలు మీడియా సంస్థలు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. అయితే బుధవారం రోజున భారత్ కు వస్తున్నారా అంటూ ఓ మీడియా అడిగిన ప్రశ్నకు మాల్యా వాట్సాప్ ద్వారా సమాధానం పంపారు. ఇలాంటి వార్తలు పుట్టిస్తున్న వారికే తెలియాలంటూ మాల్యా స్పందించారు.
ఇదిలా ఉంటే లండన్ లోని హైకమిషన్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి మాల్యా ప్రయాణంపై స్పందించారు. సోషల్ మీడియా, ఇతర వార్తా ఛానెల్స్ లో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. విజయ్ మాల్యా భారత్ కు ప్రస్తుతం అయితే వెళ్లడం లేదని నిర్ధారించారు. సీబీఐ గతంలో జారీ చేసిన పాత ప్రకటనను మీడియా ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే కోర్టు ప్రక్రియ ముగిసినప్పటికీ యూకే హోం సెక్రటరీ ప్రీతీ పటేల్ మాల్యాను భారత్ కు అప్పగించే విషయమై తయారు చేసిన డాక్యుమెంట్ల పై సంతకం చేయడంలో జాప్యం చేస్తున్నట్లు సమాచారం. అలాగే, ఇది కాకుండా లండన్‌లో మాల్యాపై మరిన్ని కేసులు నమోదు కాగా ఆ కేసులు కూడా మాల్యా భారత్‌కు రాకుండా అడ్డుకుంటున్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉంటే భారత్‌కు విజయ్ మాల్యాను అప్పగించే విషయమై ఇప్పటి వరకు ఫలానా తేదీ అని నిర్ణయించలేదని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు. మాల్యాను హీత్రో విమానాశ్రయానికి తీసుకెళ్లాల్సింది మెట్రోపాలిటన్ పోలీసులే కాబట్టి వారినుంచి ఎలాంటి సమాచారం లేదని మెట్రోపాలిటన్ పోలీసుల ప్రతినిధి ఒకరు చెప్పారు. మెట్రోపాలిటన్ పోలీసులే మాల్యాను భారత అధికారులకు విమానాశ్రయంలో అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు