Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి విజయ్.. ఈ పార్టీలోకే?

By:  Tupaki Desk   |   23 Feb 2020 6:48 AM GMT
రాజకీయాల్లోకి విజయ్.. ఈ పార్టీలోకే?
X
అమ్మ జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేసేందుకు తమిళ సినీ నటులు ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పెట్టి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రజినీకాంత్ వచ్చేస్తున్నారు. వీరి మధ్యలో ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరో అగ్ర హీరో రాజకీయ అరంగేట్రానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం మొదలైంది.

అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు బలంగా ఉన్న నేపథ్యంలో తమిళ హీరోల తాకిడి తమిళ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. ఎలాగైనా వచ్చేసారి డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తాజాగా తమిళ అగ్రహీరో విజయ్ ను పార్టీలో చేర్చుకునే విధంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో విజయ్ తన సినిమాల్లో బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించారు. దీంతో సీరియస్ అయిన బీజేపీ ఆయనపై ఐటీ దాడులు చేయించింది. ఈ నేపథ్యంలో విజయ్ ను తమ పార్టీలో చేర్చుకొని బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధించవచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షం డీఎంకే భావిస్తోంది.

తాజాగా విజయ్ ను తాము ఆహ్వానించలేదని.. విజయ్ వస్తే మాత్రం సాదరంగా ఆహ్వానిస్తామని కాంగ్రెస్ నేత ఆళగిరి తెలిపారు. కాంగ్రెస్ పగ్గాలు ఇస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన ద్వారాలు తెరిచిందనే చెప్పాలి.

అయితే కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ పై విజయ్ మాత్రం వ్యూహాత్మకంగా మౌనం కొనసాగుతోంది. త్వరలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.