Begin typing your search above and press return to search.
బాబుని నమ్మితే మళ్లీ చిప్పే..రైతులకి సలహా ఇచ్చిన విజయ సాయి రెడ్డి!
By: Tupaki Desk | 24 Dec 2019 12:46 PM GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి రాజధాని ప్రాంత రైతులు - రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గత ఏడు రోజులుగా రాజధాని ప్రాంత రైతులు రాత్రి - పగలు అన్న తేడా లేకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాలపై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పై కూడా విమర్శలు గుప్పించారు. సోమవారం రాజధాని ప్రాంత రైతులకు భరోసా కల్పించటం కోసం - నేను అండగా ఉన్నానని చెప్పటం కోసం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై రైతులకి విజయసాయి రెడ్డి ఒక సలహా ఇచ్చారు. అమరావతి పై బాబు ప్రేమ రైతుల కోసం కాదు అని , అయన బంధువర్గాల భూముల కోసం అని విమర్శించారు. తుళ్లూరు రైతులు అనవసరంగా చంద్రబాబును నమ్ముతున్నారని - చంద్రబాబును నమ్మడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదని - తన బంధువర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఇప్పటికే ఒకసారి రైతులను చంద్రబాబు ఫణంగా పెట్టారని - మరోసారి బాబు ని నమ్మితే రైతుల చేతికి చిప్ప ఇస్తాడని.. బాబు మాటలు నమ్మకండి అని ఆయన సలహా ఇచ్చారు.
ఇదే సమయంలో సుజనా పై కూడా విమర్శలు గుప్పించారు. రాజధాని మార్పు అంత తేలిక కాదని సుజనా చౌదరి మాట్లాడుతున్నాడని , మొదట బ్యాంకులకు ఎగ్గొట్టిన 5 వేల కోట్ల సంగతి తేల్చి, రాజధాని గురించి మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు అని , అమరావతిలో కొన్న 300 ఎకరాలకు పాత ధర కూడా వచ్చే అవకాశం లేదని ఆయనకి నిద్ర పట్టడం లేదు కాబోలు అంటూ సుజనా పై నిప్పులు చెరిగారు. చూడాలి మరి ఈ మూడు రాజధానుల వ్యవహారం ఎలా ముగుస్తుందో ....