Begin typing your search above and press return to search.
పవన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి రిటార్ట్!
By: Tupaki Desk | 15 March 2018 12:52 PM GMTగుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ - చంద్రబాబు - లోకేశ్ లపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న పవన్ ఒక్కసారిగా....తమపై విరుచుకుపడడంతో ఏపీ సీఎం చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. తాజాగా, పవన్ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. నాలుగేళ్లుగా వైసీపీ చెబుతోన్న మాటలనే పవన్ పునరుద్ఘాటించారని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలను పవన్ విమర్శించడం మంచి పరిణామమన్నారు. ఏపీలోని టీడీపీ సర్కార్ అవినీతిని పవన్ బయటపెట్టడాన్ని తాను అభినందిస్తున్నానన్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్ దేనని ఆయన అన్నారు. అయితే, అదే సమయంలో తనపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రధాని - కేంద్ర మంత్రులు - రాష్ట్ర మంత్రులను తాను కలుస్తున్నానని చెప్పారు. అదే క్రమంలో తనకు ప్రధాని అపాయింట్ మెట్ లభించిందని చెప్పారు. బాబులాగా తాను అవినీతికి పాల్పడటం లేదన్నారు. ఓటుకు నోటు కేసు గురించి తప్పించమని కోరేందుకు బాబు....ప్రధాని అపాయింట్ మెంట్ అడిగారని చెప్పారు. సీఎంగా అపార అనుభవమున్న చంద్రబాబుకు అపాయింట్ మెంట్ దొరకకపోవడం ఆయనకు క్రెడిబులిటీ - క్యారెక్టర్ లేదనడానికి నిదర్శనమన్నారు. బాబు లాంటి అవినీతిపరులకు విజ్ఞానవంతులకు ఎవరూ అపాయింట్ మెంట్ ఇవ్వరన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ విజయసాయిరెడ్డి గురువారం పార్లమెంట్ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హోదా సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.