Begin typing your search above and press return to search.
అమెరికాలోని టెకీల కోసం..విజయసాయిరెడ్డి గలం
By: Tupaki Desk | 18 July 2018 4:24 PM GMTఅవకాశాల స్వర్గం అనే పేరున్న అమెరికాలో ఇటీవలి కాలంలో మన టెకీలకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. కొత్త వీసాలు పొందేందుకు - ఉన్న వాటిని రెన్యువల్ చేసేందుకు అనేక షరతులు విధిస్తూ అగ్రరాజ్యం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతోపాటుగా అమెరికాలో నివసిస్తున్న వారు సోషల్ సెక్యురిటీ ప్రయోజనాలు పొందేందుకు సైతం సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటి వల్ల అమెరికాపై ఆశలు పెట్టుకున్న అనేక మంది నిరాశకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు అమెరికా ప్రభుత్వం ఏం చేస్తోంది? మనోళ్ల ప్రయోజనాలకోసం దేశం ఏం చేస్తోందనే అంశాన్ని తెలుసుకునేందుకు - పరిష్కార మార్గాలను చూపేందుకు వైఎస్ ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి - ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటు వేదికగా గలం విప్పారు.
హెచ్-1బీ - ఎల్-1 వీసాలపై అమెరికాలో పనిచేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ కింద ఏటా బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవం కాదా, ఈ వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది...అంటూ వి.విజయసాయిరెడ్డి సుదీర్ఘ ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర వాణిజ్య - పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సీ.ఆర్. చౌధరి సమాధానం ఇచ్చారు. హెచ్1బీ వీసాలపై అమెరికాలో పని చేస్తున్న లక్షలాది మంది ప్రవాసీ భారతీయులకు సామాజిక భద్రత కల్పించే అంశంపై అమెరికా ద్వంద విధానం అవలంబిస్తున్నట్లు ఆయన రాజ్యసభలో అంగీకరించారు. ``భారతీయులతో సహా ప్రవాసీ ఉద్యోగులు ఎవరైనా 40 క్వార్టర్లు లేదా 10 ఏళ్ళు పూర్తిగా సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లించిన తర్వాత మాత్రమే వాటి ప్రయోజనాలు పొందడానికి అర్హులు అన్నది అమెరికా ప్రభుత్వ విధానం. అయితే హెచ్-1బీ - ఎల్-1 వీసాలపై పనిచేసే ప్రవాసీలు అమెరికాలో గరిష్టంగా 7 ఏళ్ళకు మించి నివసించడానికి వీల్లేదన్నది కూడా ఆ ప్రభుత్వం విధానం. ఈ రెండు విధానాల మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా ఆయా వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్న వారు దాని ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడానికి అనర్హులు` అని మంత్రి తెలిపారు. ఇదే అంశాన్ని అమెరికా ప్రభుత్వంతో మంత్రిత్వ స్థాయి చర్చలలో అనేక మార్లు లేవనెత్తి సానుకూలంగా పరిష్కరించాలని కోరినప్పటికీ చట్టం అంగీకరించదంటూ అమెరికా వాదిస్తోందని మంత్రి తెలిపారు.