Begin typing your search above and press return to search.

విజ‌యసాయిరెడ్డి ప్ర‌శ్న బాబు గుట్టును ర‌ట్టు చేసింది

By:  Tupaki Desk   |   13 Dec 2018 1:28 PM GMT
విజ‌యసాయిరెడ్డి ప్ర‌శ్న బాబు గుట్టును ర‌ట్టు చేసింది
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం ప్ర‌చా అర్బాటం ఒక‌టి..వాస్త‌వంలో మ‌రొక‌టి అనే విష‌యాన్ని ప‌దే ప‌దే వెల్ల‌డించే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌రోమారుఅదే విష‌యాన్ని రుజువు చేసింది. ఏపీ సీఎం తీరును ఎండ‌గ‌ట్ట‌డంలో ముందుండే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్య‌స‌భ‌ సభ్యుడు - పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.విజయసాయిరెడ్డి తాజాగా బాబు ప్ర‌చార ఆర్భాటాన్ని మ‌రోమారు బ‌య‌ట‌పెట్టారు. ఏపీకి కేంద్రం 9.59 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే...కట్టింది 1 లక్ష ఇళ్లు అని రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర‌ మంత్రి జవాబు ఇచ్చారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి గురువారం రాజ్యసభలో స‌మాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం కింద 2015 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కు 9 లక్షల 59 వేల 847 ఇళ్ళు కేటాయించి 14 వేల 414 కోట్ల రూపాయలు కేంద్ర సాయం కింద విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. అయితే కేటాయించిన ఇళ్ళలో ఇప్పటి వరకు కేవలం 1 లక్షా 9 వేల 969 ఇళ్ళు మాత్రమే నిర్మాణం పూర్తయినట్లు మంత్రి పేర్కొన్నారు.

పీఎంఏవై కింద కేంద్ర ప్రభుత్వం 3,627 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి విడుదల చేసిందని మంత్రి వెల్ల‌డించారు. అలాగే రాష్ట్రంలో 5,298 ఇళ్ళు సేకరణ/నిర్మాణం కోసం లబ్దిదారులకు సబ్సిడీ కింద చెల్లించేందుకు రుణాలతో లింకైన సబ్సిడీ పథకం కింద 113 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదల చేసినట్లు కూడా ఆయన తెలిపారు. పీఎంఏవై కింద విడుదల చేసిన 3.627 కోట్ల రూపాయలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2,788 కోట్ల మేరకు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను సమర్పించిందని మంత్రి తన జవాబులో పేర్కొన్నారు.

పీఎంఏవై కింద బలహీనవర్గాల ఇళ్ళకు డిమాండ్‌ ఏ మేరకు ఉందో ఆయా రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలే అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌ లో 13.78 లక్షల ఇళ్ళు నిర్మించాల్సిన అవసరం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. రాష్ట్రంలో 2015 నుంచి ఇప్పటి వరకు వివిధ జిల్లాల్లో మురికివాడల పునర్నిర్మాణంతో కూడా కలిపి 1 లక్షా 9 వేల ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. మరో 6 లక్షల ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైందని మంత్రి వివరించారు.