Begin typing your search above and press return to search.
తుఫాను వస్తే బాబుకు ఊపొస్తుంది!
By: Tupaki Desk | 18 Dec 2018 1:02 PM GMTచంద్రబాబు వచ్చి నాలుగేళ్లు పూర్తయ్య అయిదో ఏడాది నడుస్తుంది. ఆయన నాలుగేళ్ల పాలనకు సూచన అన్నట్టు.. నాలుగు తుఫాన్లు వచ్చాయి. చిత్రమేంటంటే... ఏ ప్రభుత్వం అయినా తుఫానులు అంటే భయపడుతుంది. కానీ ఏపీ ప్రభుత్వానికి తుఫానులు వస్తే ఊపొస్తుంది. ఆ తుఫానుల్లోంచి టీడీపీ పాలకులు ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే, ఒక్క ఆదాయ మార్గాలేం కర్మ నారా వారి కుటుంబం దానిని విచ్చలవిడిగా పబ్లిసిటీకి కూడా వాడుతోందని గతంలో విజయసాయిరెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఏపీలో కనిపించే బస్సులు - హోర్డింగులు చాలు వీళ్ల ఆరోపణల్లో నిజం ఉందో లేదో చెప్పడానికి.
తాజాగా ఆవరించిన పెథాయ్ తుఫాను రాష్ట్రాన్ని భయకంపితం చేస్తుండగానే చంద్రబాబు ఒక ఉత్తరాది టూరు - ఇంకో దక్షిణాది టూరు వేశారు. వర్క్ ఫ్రం హోం లాగా - వర్క్ ఫ్రం టూర్ అన్నట్టు అక్కడి నుంచే చంద్రబాబు తుఫానుపై ట్వీట్లు వేస్తూ తన పని తాను చేసుకున్నారు. అయినా విగ్రహావిష్కరణలకు - ప్రమాణ స్వీకారాలకు తుఫానుకు మించిన ప్రయారిటీ ఎందుకో బాబుకే తెలియాలి. తమాషా ఏంటంటే... బాబు వెళ్లిన కార్యక్రమాలకు బాబుచెబుతున్న అలయన్స్ మిత్రుల్లో చాలామంది రాలేదు. మరి వాళ్లు సాధారణంగా వాటిని స్కిప్ చేసినపుడు ఇంత కీలకమైన పరిస్థితి ఉండి చంద్రబాబు ఎందుకు స్కిప్ చేయలేదు అన్నది అందరికీ వచ్చిన అనుమానం.
ఇక గత తుఫానుల సమయంలో వీరు తమకు అవసరమైన వారికి ఇచ్చుకునే కాంట్రాక్టుల్లోనూ బాగా దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 20 రూపాయల మొక్క నాటి 2000 బిల్లు చేస్తున్నారట. ఇక తెలుగుదేశం నేతలకు చెందిన వాహనాలే అద్దెకు తీసుకుంటారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంటే తుపాను వచ్చిందంటే తెలుగుదేశం నేతలకు మంచి గిట్టుబాటే అని నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు.