Begin typing your search above and press return to search.

బాబు కోరిన ప్యాకేజీ లెక్క చెప్పిన కేంద్ర‌మంత్రి!

By:  Tupaki Desk   |   12 Feb 2019 5:19 PM GMT
బాబు కోరిన ప్యాకేజీ లెక్క చెప్పిన కేంద్ర‌మంత్రి!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా డిమాండ్ పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. రాజ్య‌స‌భ‌లో కేంద్ర‌మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్యాకేజీకి ఓకేనంటూ బాబు స‌ర్కారు గ‌తంలో ఓకే చెప్ప‌టం.. దానిపై అభినంద‌న స‌భ‌లు నిర్వ‌హించుకోవ‌టం తెలిసిందే. ఇటీవ‌ల కాలంలో ప్ర‌త్యేక హోదా మీద మ‌ళ్లీ గ‌ళం విప్ప‌టం ద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని ఆశిస్తున్న బాబు స‌ర్కారు.. దీక్ష పేరుతో కొత్త నాట‌కానికి తెర తీసిన‌ట్లుగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి అడిగిన ఒక ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన కేంద్ర‌మంత్రి పీయూష్ గోయిల్ ఆస‌క్తిక‌ర మైన స‌మాధానాన్ని ఇచ్చారు. ప్ర‌త్యేక మోదాకు ప్ర‌త్యామ్నాయంగా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించింద‌ని.. దానికి సీఎం చంద్ర‌బాబు స్వాగ‌తించార‌న్నారు. 2016 అక్టోబ‌రులో కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీకి ఏపీ స‌ర్కారు ఆమోదం ప‌లికింద‌న్నారు.

ఏపీ స‌ర్కారు కోరిన‌ట్లే ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ కొన్ని మార్పులు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. దీనికి 2017లో కేంద్ర‌మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింద‌న్నారు. కేంద్రానికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన మార్పుల్ని ఆయ‌న వెల్ల‌డించారు. అవేమంటే..

1. కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగానే విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌(ఈఏపీ)లకు సైతం కేంద్రం వాటా 90 శాతం - రాష్ట్రం వాటా 10 శాతం కింద సాయం చేయాలి. 2. ఇతర ఈఏపీలు - చిన్న మొత్తాల పొదుపు - నాబార్డు నుంచి అప్పటికే పొందిన రుణాల తిరిగి చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలి.

3. దేశీయ ఆర్థిక సంస్థలైన నాబార్డ్‌ - హడ్కో ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడానికి అనుమతించాలి.

4. కేంద్ర ప్రభుత్వం - నాబార్డ్‌ - విదేశీ ఆర్థిక సంస్థల నుంచి పొందిన అప్పులపై వడ్డీ చెల్లించడానికి విరామం పొందే వీలు కల్పించాలి.

5. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక ఆర్థిక సాయం చర్యలను రాష్ట్ర ఎఫ్‌ ఆర్‌ బీఎం పరిధిలోకి చేర్చకూడదు