Begin typing your search above and press return to search.
జేడీ జనసేనలోకి.. నిజం చెప్పిన విజయసాయి
By: Tupaki Desk | 18 March 2019 10:57 AM GMTసీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరాడని సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి.. జేడీ జనసేనలో చేరికపై విమర్శలు గుప్పించారు..
‘లక్ష్మీనారాయణ గారూ.. ఇప్పుడు జనసైనికుడిగా మారడమేంటి? మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే కదా.. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారా.? ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో.. ఇక ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసి దుయ్యబట్టారు..
మరో ట్వీట్ లోనూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. 35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారని.. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయటపడలేక పోయారేమిటీ తుప్పు నాయుడు గారూ’ అంటూ విమర్శలు గుప్పించారు. అర్థం లేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారని.. మంచి డాక్టర్ ను కలిస్తే ట్రీట్ మెంట్ ఇస్తాడని ఎద్దేవా చేశారు.
ఇక అలెగ్టాండర్ కు 10 లక్షల సైనికులుంటే ప్రపంచం గెలిచాడని.. తనకు 65 లక్షల పసుపు సైన్యం ఉందని బాబు చేసిన విమర్శలకు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. కొట్టేసిన 3.75 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు కూడా బాబు వద్ద ఉన్నాయని.. అవి కూడా చెప్పండి అంటూ సెటైర్ వేశారు. ‘తెలుగు దేశం గాలి వీస్తోందని మీరు అంటూ.. ఫ్యాన్ గాలి వీస్తోందని ప్రజలకు వినిపిస్తోందని’ బాబుకు ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.