Begin typing your search above and press return to search.
కోడెలకు టార్గెట్ ఫిక్స్ చేసిన వైసీపీ
By: Tupaki Desk | 9 Jun 2019 9:03 AM GMTటీడీపీ హయాంలో అధికారం అండతో దోచుకున్న వారి లెక్కలు సరిచేయాలని అధికార వైసీపీ ఆలోచిస్తుందా.? జగన్ ఇప్పటికే అమరావతి రాజధాని భూకుంభకోణంపై విచారణ చేయిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని టార్గెట్ చేసి దెబ్బతీసిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వైసీపీ తాజాగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
తాజాగా వైసీపీ సీనియర్ నేత - ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కోడెల అరాచకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి చర్చనీయాంశంగా మారాయి. కోడెల కుటుంబం ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల శివప్రసాద్ రావు, కుటుంబ సభ్యులందరూ చట్టం నుంచి తప్పించుకోలేరు అంటూ విజయసాయి రెడ్డి హెచ్చరించడం సంచలనంగా మారింది.
ఇక కోడెలకు అన్ని విధాల సహకరించిన అధికారులు, నిర్బంధ వసూళ్లు చేసిన మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. బాధితులు నిర్భయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వైఎస్ జగన్ మేనిఫెస్టోను పవిత్ర గంథ్రంలా భావిస్తున్నారని.. బాబు మాత్రం గెలిచాక మేనిఫెస్టోనే మాయంచేయడం చూశామని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సచివాలయంలో సీఎం చాంబర్ లో కూడా నవరత్నాలను పెట్టి ప్రతీక్షణం జగన్ వాటి అమలు కోసం కృషి చేయబోతున్నారని అన్నారు.