Begin typing your search above and press return to search.
పవన్.. మందలగిరి మాలోకానికి మించి..!
By: Tupaki Desk | 5 April 2019 11:01 AM GMTఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం అంతకంతకూ వేడెక్కుతోంది. ఓటర్ మూడ్ మార్చేందుకు ఎవరికి వారు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా రంధ్రాన్వేణ చేసి మరీ తిట్టేస్తున్నారు.
ప్రచారంలో భాగంగా తిట్ల వర్షం కురిపిస్తున్న నేతలు.. సోషల్ మీడియాలో తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపే కన్నా.. గెలుపోటముల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడటం తెలిసిందే.
తమను అదే పనిగా తప్పు పడుతూ.. విమర్శలు చేస్తున్న పవన్ పై జగన్ బ్యాచ్ విరుచుకుపడింది. తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతాలో పవన్ కు పంచ్ లు వేస్తూ.. చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ మాటలకు తమదైన భాష్యం చెబుతూ.. పవన్ మాటల్ని తేలిక చేసే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ మాటల్లో స్పష్టత మిస్ అయ్యిందని.. కన్ఫ్యూజింగ్ మాష్టారుగా అభివర్ణిస్తూ ఆయనపై సటైర్లు వేస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకదాన్ని చూస్తే.. తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో ఎవరి తరఫున ఉండాలో పవన్ కల్యాణ్ కే స్పష్టత లేదన్న విమర్శ చేశారు. ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్లను కొడుతున్నారంటూ ఆ గట్టు మీద నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్రా వాళ్లకు చుక్కలు చూఐపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బలు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా అంటూ ఎటకారం ఆడేశారు.
ముసుగులో గుద్దులాట ఎందుకు? ముసుగులు కప్పుకునేది విలన్లు.. హీరోలు కాదు కదా? అంటూ.. జగన్ ను తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారన్న భయంతో కాబోలంటూ వ్యంగ్యస్త్రాల్ని సంధించారు. కళ్లు తెరిచినా.. మూసినా చంద్రబాబు.. పవన్ కు జగనే కనిపిస్తున్నారని.. ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయటానికి ప్రయాస పడి మరీ పవన్ నటిస్తున్నట్లు తప్పు పట్టారు.