Begin typing your search above and press return to search.
పరిపాలన రాజధానిగా విశాఖ..విజయసాయిరెడ్డి క్లారిటీ
By: Tupaki Desk | 26 Dec 2019 10:07 AM GMTవిశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా లేదా అన్న టెన్షన్ ఇప్పుడు ఏపీ ప్రజలను వెంటాడుతోంది. అమలు జరిగి తీరాలని ఉత్తరాంధ్రులు, వద్దని అమరావతి ప్రాంత రైతులు ప్రజలు, నేతలు కోరుతున్నారు. ఇక విశాఖను పరిపాలన రాజధానిగా 27న జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారమూ జరుగుతోంది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
గురువారం విశాఖ కలెక్టర్, అధికారులతో సమీక్షించిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి సీఎం జగన్ ఉత్తరాంధ్రకు మంచి బహుమానం ఇచ్చారని.. ఈనెల 28న విశాఖకు వస్తున్న జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఇక తనపై విశాఖలో వివాదాస్పద ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందించారు. విశాఖలో ఆస్తులపై తాను ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసి చెప్పలేదని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో తన పేరును వాడుకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు సూచించారు.విశాఖలో తనకు ఒక్క ఫ్లాట్ తప్ప ఏమీ లేదని స్పష్టం చేశారు.
ఇక విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్ కు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపాలంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు ట్వీట్ లో విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు.