Begin typing your search above and press return to search.

జమిలికి సై.... వైఎస్ ఆర్ సిపి!

By:  Tupaki Desk   |   10 July 2018 4:35 PM GMT
జమిలికి సై.... వైఎస్ ఆర్ సిపి!
X
" ఓకే దేశం.. ఒకటే ఎన్నికలు " విధానానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జై కొట్టింది. భారతీయ జనతా పార్టీ - ముఖ‌్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఈ నినాదం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనే రేపింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై రెండుగా చీలిపోయాయి. ఒక వర్గం లోక్‌ సభకు - శాసన సభకు ఓకేసారి ఎన్నికలు జరగడాన్ని వ్యతేరికిస్తే మరో వర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఓకేసారి ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ పరిణామం " ఓకే దేశం.. ఒకటే ఎన్నికలు " నినాదానికి ఎంతో బలన్నిస్తుంది. ఎన్నికల పేరుతో కోట్లాది రూపాయల అనవసరపు ఖర్చుకు " ఓకే దేశం.. ఒకటే ఎన్నికలు " ఫుల్‌ స్టాప్ పెడుతుంది. అటు ప్రభుత్వానికి - ఇటు ఎన్నికలలో నిలబడే అభ్యర్దులకు కూడా ఖర్చులు తడిసి మోపెడు అవ్వకుండా నివారిస్తుంది.

అయితే, కొన్ని రాజకీయ పార్టీలు " ఓకే దేశం.. ఒకటే ఎన్నికలు " విధానం వెనుక కుట్ర ఉందని - ఏదో జరిగిపోతోందని అనవసరపు రాధాంతం స్రుష్టిస్తున్నాయి. ఈ జమిలి ఎన్నికలపై స్పష్టత కొన్ని రాజకీయ పార్టీలు దీనికి అంగీకారం తెలుపుతున్నాయి. తాజాగా ఆ మద్దత్తు తెలుపుతున్న పార్టీలలో వైఎస్ ఆర్ సిపి... బిజూ జనతా దళ్ కూడా చేరాయి. ఇది దేశ రాజకీయాలను మలుపు తిప్పే పరిణామం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి జమిలి ఎన్నికలకు ఓకే చెప్పింది. ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జత కలవడంతో జమిలి ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. "దేశ ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని జమిలి ఎన్నికల విధానానికి మా పార్టీ మద్దత్తు తెలుపుతోంది " అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు - ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ప్రకటించారు. పార్టీ మారిన అభ్యర్దులను అర్హులు - అనర్హులుగా ప్రకటించే అధికారాన్ని స్పీకర్ కు కాకుండా ఎన్నికలా సంఘానికి కాని - లేదు మరొక
అధారిటీకి కాని అప్పగించాలని ఈ సంధర్భంగా విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు.దేశంలో చిటికీమాటికీ ఎన్నికలు రావడం వల్ల డబ్బు వ్రుధా కావడమే కాకుండా మానవ వనరులూ - అధికార యంత్రాంగం పనితీరుపై కూడా ప్రభావం చూపతోందని విజయసాయి రెడ్డి అన్నారు .ఈ జమిలి ఎన్నికలకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ తో పాటు బిజూ జనతా దళ్ కూడా సై అంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ పినాకిని మిశ్రా ఈ జమిలి ఎన్నికల విధానానికి తామే ముందు ప్రతిపాదన తీసుకువచ్చామని అన్నారు. " 2004 వ సంవత్సరం లోనే మా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీసుకు వచ్చారు " అని పినాకిని మిశ్రా స్పష్టం చేసారు. ఈ రెండు పార్టీల మద్దత్తుతో జమిలి ఎన్నికలకు సిద్ధమయ్యే పార్టీలు మరికొన్ని ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి...