Begin typing your search above and press return to search.
బాబు - యనమల గాలి తీసిన విజయసాయి రెడ్డి
By: Tupaki Desk | 29 Aug 2019 7:17 AM GMTమళ్లీ అదే కథ.. తెలంగాణ పేరుతో టీడీపీ గగ్గోలు. జనం ఓసారి బుద్దిచెప్పినా మారని తీరు.. పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు ఆయన అనుయాయులు..పచ్చ మీడియా తీవ్ర దుష్ప్ర చారం చేసింది. ఏపీని వ్యతిరేకించే కేసీఆర్ తో జగన్ చేతులు కలిపాడని.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతారని చంద్రబాబు ప్రతీ సభలో గగ్గోలు పెట్టారు. అయినా జనం జగన్ నే విశ్వసించారు. గెలిపించారు. తెలంగాణతో స్నేహం ఏపీకి మంచిదేనని నిరూపించారు.
మళ్లీ అదే పాత పాట.. ఏపీకి ఆర్థికమంత్రిగా పనిచేసిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తాజాగా తెలంగాణ లబ్ధి కోసమే ఏపీకి సీఎం జగన్ గండికొడుతున్నాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ - ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా నిప్పులు కురిపించారు. ‘ ఏపీ ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కినెట్టిన యనమల ఎన్నికల ముందు కూడా ఇలానే కేసీఆర్ - మోడీలతో జగన్ చేతులు కలిపితే ఏపీకి అన్యాయం అని ఆరోపించాడు.. అప్పుడే జనాలు మీపై తుపుకున్న ఉమ్మేశారు మరిచిపోయారా?’ అంటూ యనమల గాలితీసే మాటల తూటాలు పేల్చారు విజయసాయిరెడ్డి
ఇక చంద్రబాబును కూడా వద్దల్లేదు విజయసాయిరెడ్డి.. ఏపీ రాజధాని మార్పు అంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు - ఆయన అనుయాయుల బండారం బయటపెట్టారు. రాజధాని మార్పుపై అక్కడ భూములు కొన్న టీడీపీ నేతలంతా బట్టలు చింపుకుంటున్నారని.. రాజధాని తరలిపోతే వేల కోట్ల పెట్టుబడులు ఏమోపోతాయని వారంతా పీడకలలు కంటున్నారని..రియల్ ఎస్టేట్ తప్ప వీరి ధ్యాస లేదని.. రాష్ట్రంలోని సమస్యలపై కనిపించడం లేదా? హైదరాబాద్ లో ధరలు పెరుగుతున్నాయని గగ్గోలు పెడుతారెందుకు? ’ అంటూ చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి..
తెలంగాణను బూచీగా చూపి టీడీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన విష ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించి జనాలు జగన్ నే గెలిపించారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ పేరుతో యాగి చేస్తున్న టీడీపీ నేతలకు విజయసాయి రెడ్డి కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి చేశారు.