Begin typing your search above and press return to search.
విజయసాయి రెడ్డి ఆపేయమన్న బిల్లు లెక్క ఏంది?
By: Tupaki Desk | 19 April 2019 4:58 AM GMTహోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికలు ముగిసి.. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయటం తెలిసిందే. మే 23 న ప్రజాతీర్పు బయటకు రానుంది. అప్పటివరకూ ప్రభుత్వ నిర్వహణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉంటుంది. అలా అని పూర్తిస్థాయి ముఖ్యమంత్రి మాదిరి వ్యవహరించే వీలు ఉండదు. కానీ.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. బాబు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎన్నికల్లో తలపడ్డ ప్రధాన పార్టీలు గెలుపు ధీమాను ప్రదర్శిస్తుంటాయి. అంత మాత్రాన పార్టీలు గెలవవు కదా? ఈ కారణంతోనే ఎన్నికలు జరిగిన వేళ.. ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారే కానీ.. సమావేశాలు.. సమీక్షలు.. ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటం ఉండదు.
కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న బాబు తీరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం చేసిన ఒక డిమాండ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు రాసిన లేఖలో నిపుణుల అభిప్రాయంతో కానీ.. సలహా లేకుండానే రాష్ట్రప్రభుత్వం హడావుడిగా ఒక సాఫ్ట్ వేర్.. అప్లికేషన్ సరఫరాకు సంబంధించిన బిల్లును ఆమోదించే ప్రయత్నం చేస్తుందని.. ఆ చెల్లింపును ఆపాలని కోరారు.
రూ.12.5 కోట్ల బిల్లు ఒకటి పీ అండ్ ఎల్ నుంచి పీఏవో ఆమోదం కోసం వచ్చిందని.. నిధులు లేక దాన్ని నిలిపి ఉంచారని ఆయన పేర్కొన్నారు. వెబ్ ఇంటెలిజెన్స్ కు సాఫ్ట్ వేర్ ను.. దొంగచాటుగా ఇతరుల సమాచారాన్ని పొందే ఐఎంఎస్ ఐ క్యాచర్స్ వంటి సాంకేతికతను అందించిన ఇజ్రాయిల్ కంపెనీ వెరిన్ట్ కు చెల్లించాల్సిన మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లును సమీక్షించాలని చెబుతున్న విజయసాయి మాటలు ఇప్పుడు ఆశ్చర్యంగా మారాయి. ఎన్నికల్లో అధిక్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. గెలుపు ధీమాలో ఉన్న ఆ పార్టీకి.. ప్రభుత్వ చెల్లింపుల కోసం వస్తున్న ఫైళ్ల సమాచారం అందటం చూస్తే.. జగన్ బ్యాచ్ నెట్ వర్క్ సత్తా తెలుస్తుందని చెప్పక తప్పదు. విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన ఫైల్ విషయంలో ఏపీ సర్కారు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.