Begin typing your search above and press return to search.

బాబుకు జ‌గ‌న్ కు తేడా చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి

By:  Tupaki Desk   |   10 Jun 2019 8:31 AM GMT
బాబుకు జ‌గ‌న్ కు తేడా చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి
X
అవ‌కాశం ల‌భిస్తే చాలు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును ట్వీట్ తో ఉతికి పారేసే అల‌వాటున్న విజ‌య‌సాయి రెడ్డి తాజాగా మ‌రో కీల‌క వ్యాఖ్య చేశారు. ప్ర‌ధాని మోడీ తిరుప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రాష్ట్ర అభివృద్ధికి త‌న స‌హ‌కారం స‌దా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన విజ‌య‌సాయి.. మోడీకి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ.. చంద్ర‌బాబు పాల‌న‌పై ఫైర్ అయ్యారు.

బాబు పాల‌న‌లోని లోపాల్ని ఎత్తి చూపుతూ.. పాల‌కుడికి.. మ్యానిపులేట‌ర్ కు ఉన్న తేడా ఇదే.. తెలుసుకో అంటూ ట్వీట్ పంచ్ విసిరారు. త‌మ వేత‌నాన్ని రూ.3వేల నుంచి రూ.6వేల‌కు పెంచాల‌ని ధ‌ర్నా చేసిన ఆశా అక్కాచెల్లెళ్ల‌పై మ‌హిళా దినోత్స‌వం రోజున పోలీసుల్ని ఉసిగొల్పి బాబు అరెస్ట్ చేయించాడు. కానీ.. అదే సీఎం వైఎస్ జ‌గ‌న్ మాత్రం తాను ముంద‌స్తు హామీ ఇవ్వ‌కున్నా ఆశా వ‌ర్క‌ర్ల వేత‌నాల్ని 300 శాతం పెంచుతూ కొత్త ఆశ‌ల్నినింపార‌న్నారు.

పాల‌కుడికి.. మ్యానిపులేట‌ర్ కు ఇదే తేడా చంద్ర‌బాబు అంటూ చుర‌క‌లు అంటించారు. రాష్ట్ర అభివృద్ధికి త‌మ స‌హ‌కారం స‌దా ఉంటుంద‌ని హామీ ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి విజ‌యసాయి రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

స్పెష‌ల్ స్టేట‌స్ తో పాటు ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌ర్చేందుకు తోడ్పాటు నిస్తార‌ని.. ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ కాబినెట్ లో 60 శాతం మంత్రులు అణ‌గారిన వ‌ర్గాల‌కు చెందిన వారేన‌ని.. దేశంలో ద‌ళితులు.. బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆయా వ‌ర్గాల‌కు ఇంత ప్రాధాన్య‌త ల‌భించ‌లేద‌ని చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌చ్ఛితంగా బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌భుత్వ‌మేన‌ని.. బీసీల‌కు 50 శాతం నామినేష‌న్ ప‌నులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు.