Begin typing your search above and press return to search.
బాబు - చినబాబులను విజయసాయిరెడ్డి ఏకిపారేశారబ్బా!
By: Tupaki Desk | 14 July 2019 1:21 PM GMTటీడీపీ అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు - ఆయన కుమారుడు - ఎమ్మెల్సీ - పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి... మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇటీవలే జగన్ సర్కారుకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై చంద్రబాబు స్పందన, రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల నియామకాల కోసం జరుగుతున్న ఇంటర్వ్యూలపై నారా లోకేశ్ స్పందించిన తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ సాయిరెడ్డి... బాబు, చినబాబులను జాయింట్ గానే ఏకి పారేశారని చెప్పాలి. ఆదివారం ఉదయం ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన సాయిరెడ్డి... చంద్రబాబు, లోకేశ్ ల స్పందనలను ప్రస్తావిస్తూ.... ఆ స్పందనలపై తనదైన సెటైర్లు గుప్పిస్తు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విమర్శల జడివాన కురిపించారు.
వరుసగా నాలుగు ట్వీట్లను సంధించేసిన సాయిరెడ్డి... ఓ ట్వీట్ ను పూర్తిగా లోకేశ్ కు కేటాయిస్తే... ఆ గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలకు వెళ్లాలని లోకేశ్ కు సూచించి సంచలనం రేపారు. తాజా ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో కూడా తెలియలేనంతగా యాక్షన్ చేస్తున్న మీరు, మీ నాన్న గారు డ్రామాలాడుతున్నారని ఫైర్ అయిన సాయిరెడ్డి... గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలు ఎంత నిష్పక్షపాతంగా జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఓ సారి ఆ ఇంటర్వ్యూలకు వెళ్లి రావాలని లోకేశ్ కు సూచించారు. ఇక మిగిలిన మూడు ట్వీట్లను చంద్రబాబును టార్గెట్ చేసే చేసిన సాయిరెడ్డి... బాబు అవినీతి పాలన, జనం హృదయాల్లో బాబు నిలిచే తీరు, రాజధాని పేరిట గ్రాఫిక్స్ డిజైన్లను ప్రస్తావించారు. ఆ ట్వీట్లు వరుసగా కింది విధంగా సాగాయి.
*అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబు గారికి బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే. లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్ళకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి?*
*ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీది. గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నావు. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా.*
*రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హతేమీ కాదు చంద్రబాబు గారూ. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఈ 40 ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారు. రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిన్నారు. భావితరాలకు మీ చరిత్ర మీరు అలానే గుర్తుండిపోతుంది.*
*మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని జగన్ గారు చెప్పారు. శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా మీరు తెచ్చుకున్న పేరు అలాగే ఉంటుంది టెన్షన్ పడకండి. ఆ రికార్డు మీకే సొంతం. జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారి ప్రోగ్రెస్ ఉంటుంది. చూస్తారుగా తొందరెందుకు?*