Begin typing your search above and press return to search.
చంద్రబాబు చరిత్ర ఏమిటంటున్న వైసీపీ ఎంపీ!
By: Tupaki Desk | 13 March 2020 11:45 AM GMTతెలుగుదేశం అధినేత ఇంకా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకుండానే శోకాలు పెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. వరస ట్వీట్లతో చంద్రబాబు నాయుడు తీరును ఎండగట్టారాయన. స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యుతంగా జరగడం లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి వివిధ అంశాను ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికలూ గట్రా జరిగిన వైనాన్ని ఆయన గుర్తి చేశారు. ఆ మేరకు ట్వీట్ చేశారు.
ఎలక్షన్లలో అక్రమాలు, అరాచకాల గురించి చంద్రబాబు సుద్దులు చెబుతున్నాడు. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా? మాపార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బెదిరించి జెడ్పీలను, ఎమ్మెల్సీ పదవులను లాక్కుంది ఎవరు? గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడు బురద చల్లుతున్నావు.
ఎంతకైనా దిగజారతాడు చంద్రబాబు. పోలీసులు - ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కులాలు అంటగడతాడు. అధికార పార్టీ సానుభూతిపరులని ముద్ర వేస్తాడు. ఎల్లో మీడియా కమ్మగా సన్నాయి మోగిస్తుంది. ప్రజలు నమ్ముతున్నారని భ్రమ పడతాడు. ఆఖరున నేనెందుకు ఓడానో అర్థం కావడం లేదని శోకాలు పెడతాడు
పొత్తులకు కూడా కొన్ని సైద్ధాంతిక విలువలు, నియమాలుంటాయి. బిజెపితో అంటకాగుతున్న జనసేనతో తెలుగుదేశం సీట్ల సర్ధుబాటు చేసుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారు. అభ్యర్థులు లేని చోటల్లా జనసేనకు వదిలేశామని చెప్పుకుంటున్నారట. ఒక్క మండలమైనా కచ్చితంగా గెలుస్తామని చెప్పండి చూద్దాం.
ఇలా వరస ట్వీట్లతో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలను ఎదుర్కొంటున్న తీరును, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికలపై స్పందిస్తున్న తీరును విమర్శించారు విజయసాయిరెడ్డి.