Begin typing your search above and press return to search.
శవాలపై పేలాలు ఏరుకుంటోన్న టీడీపీ నేతలు
By: Tupaki Desk | 5 Nov 2018 3:28 PM GMTగత నాలుగేళ్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. భూకబ్జాలు...ప్రాజెక్టుల్లో అవినీతి....వంటి వ్యవహారాలను వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. ఏపీలో పాలన అస్తవ్యస్థంగా ఉందని - నియంత పాలన సాగుతోందని వైసీపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. తాజాగా టీడీపీ సర్కార్ పాలన పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు అసమర్థ పాలనను ఆయన ఎండగట్టారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దుష్టపాలన సాగిస్తోందనంటూ మండిపడ్డారు. తిత్లీ తుపాను బాధితుల పరిహారం వ్యవహారంలో టీడీపీ నేతలు శైలి శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్లుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాకి లెక్కలు చూపించి....పచ్చ చొక్కాలు పరిహారాన్ని దోచేశాయని మండిపడ్డారు.
ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు - టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తిత్లీ తుపాన్ విధ్వంసంతో పరిహారం కోసం దీనంగా ఎదురుచూస్తున్న బాధితుల పరిహారాన్ని టీడీపీ నేతలు హైజాక్ చేశారని నిప్పులు చెరిగారు. ``శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు పచ్చ చొక్కా నేతలు! తిత్లీ తుపాను విధ్వంసంతో కొబ్బరి - జీడి - వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే ఎన్యూమరేషన్ ను హైజాక్ చేసిన పచ్చ చొక్కాలు దానిని కూడా గుటకాయ స్వాహా చేసి రైతుల నోట్లో మన్ను కొట్టారు.సెంటు భూమి లేని వారు సైతం 150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్లు రాయించుకున్న ఘటనలు కోకొల్లలు! 0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు. ఎకరాకి 60 కొబ్బరి చెట్లు చొప్పున 3 ఎకరాలకు 180 చెట్లు. పరిహారం 2.70 లక్షలు. కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని హాంఫట్ చేసిన తీరిది!``అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
మరోవైపు - ఎన్టీఆర్ విద్యోన్నతి కోచింగ్ సెంటర్ల కేటాయింపులోనూ చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. పలువురు అభ్యర్థులకు...చాలా దూరంగా కోచింగ్ సెంటర్లను కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. తమకు దగ్గర్లో ఉన్న హైదరాబాద్ - విజయవాడలలో సెంటర్లు కోరుకున్నారని - కానీ, తెలుగు మీడియం సౌకర్యం లేని - ఢిల్లీలో సెంటర్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా చంద్రబాబునాయుడిపై విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో మండిపడుతోన్న సంగతి తెలిసిందే.