Begin typing your search above and press return to search.

బాబుకు మ‌తిమ‌రుపు ఎక్కువైందంటూ ఫైర్!

By:  Tupaki Desk   |   15 March 2018 4:47 AM GMT
బాబుకు మ‌తిమ‌రుపు ఎక్కువైందంటూ ఫైర్!
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై జ‌గ‌న్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బాబుకు మ‌తిమ‌రుపు వ్యాధి ఎక్కువైంద‌ని.. ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ట్లు ఆయ‌న మండిప‌డ్డారు. బీజేపీతో త‌మ పార్టీ క‌లిసిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌ల్ని ఆయ‌న ద‌గ్గ‌ర మీడియా ప్ర‌తినిధులు ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా బాబుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

బాబుకు తానేం మాట్లాడుతున్నానో ఆయ‌న‌కే అర్థం కావ‌టం లేద‌ని.. తాము చెప్పిన మాట‌ల్ని వ‌క్రీక‌రించి మాట్లాడ‌టంలో అర్థం లేద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఎవ‌రైతే ఇస్తారో.. వారితో క‌లిసి ప‌ని చేయ‌టానికి తాము సిద్ధ‌మ‌ని తేల్చి చెప్పారు.

బాబు మాదిరి రోజుకో మాదిరి.. నెల‌కో మాదిరి.. ఏడాదికోలా మాట్లాడ‌టం త‌మ‌కు రాద‌న్న విజ‌య‌సాయి రెడ్డి.. ఊస‌ర‌వెల్లిలా మార‌టం త‌మ‌కు చేత‌కాద‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు విధానాల్ని మార్చుకోవ‌టం త‌మ వైఖ‌రి కాద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌పై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తున్న చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం గ‌మ‌నార్హం.