Begin typing your search above and press return to search.
డైలీ బేసిస్ లో డోస్ పెంచేస్తున్న విజయసాయి రెడ్డి!
By: Tupaki Desk | 16 Jun 2019 12:34 PM GMTకొన్నిసార్లు అంతే. ఎంతగా ఒదిగి ఉంటే అంత మంచిది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే నవ్వులపాలు కావటమే కాదు.. అభాసుపాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇలానే ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా.. ఏపీ విపక్ష నేతగా ఆయనకు కొన్ని సౌకర్యాలు తగ్గుతాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే రాజసానికి.. విపక్ష నేతగా మారాక బోలెడంత తేడా వస్తుంది.
ఈ విషయాన్ని చంద్రబాబుతో సహా ఆయన పార్టీ నేతలు గుర్తించాల్సిన అవసరం ఉంది. తాము అధికారంలో ఉన్నప్పుడు భద్రతను పెంచాలని కోరుతూ పెట్టుకున్న వినతుల్ని నిర్మొహమాటంగా తీసి పక్కన పెట్టేసిన వైనాన్ని మర్చిపోకూడదు. తానేం చేశానో.. తన తర్వాత వారు అలాంటి విషయాల్లో మరింత నిర్మోహమాటంగా ఉంటారని చెప్పక తప్పదు.
ఇటీవల గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన బాబుకు.. అందరూ విపక్ష నేతల మాదిరి భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. అంతే.. ఆ ఫోటోలతో తమ్ముళ్లు చెలరేగిపోయారు. తమ అధినేతకు ఏదో అన్యాయం జరిగినట్లుగా పెడబొబ్బలు పెట్టటం షురూ చేశారు. నిజానికి ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు నేతలు ఎంత కామ్ గా ఉంటే అంత మంచిది.
పవర్ లో ఉన్నప్పుడు నడిచిన యవ్వరాలు.. పవర్ పోయిన తర్వాత ఉండవు కదా. ఈ చిన్న లాజిక్కును మర్చిపోయిన తెలుగు తమ్ముళ్లు.. తమ అధినేతకు జరగరానిదేదో జరిగినట్లుగా హాహాకారాలు చేయటం.. మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ బాబుకు నష్టం చేస్తుందన్న అంచనా విషయంలో టీడీపీ తమ్ముళ్లు ఎంత ఫెయిల్ అయ్యారన్నది తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను చూస్తే అర్థమవుతుంది.
తరచూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ఖాతాలో చెలరేగిపోయే విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టారు. ఎయిర్ పోర్ట్ లో అందరికి మాదిరి తనిఖీలు ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా బాబుకు ఏదో అన్యాయం జరిగినట్లుగా పెడబొబ్బలు పెట్టిన తమ్ముళ్లకు చురకలు అంటిస్తూ విజయసాయి కొన్ని ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్లను చూస్తే.. ఇటీవల కాలంలో ఆయన ట్వీట్ల ఘాటు రోజురోజుకు పెరుగుతుందని చెప్పకతప్పదు.
విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తే..
+ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ తమ నాయకుడి సౌకర్యాలు, ఇబ్బందుల గురించి ఆందోళనకు దిగడం సిగ్గుచేటు. విమానాశ్రయ భద్రతా నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే. ప్రజలు ఛీకొట్టిన తర్వాత కూడా ఇంకా సీఎంగానే కొనసాగుతున్నట్టు ఆయన భ్రమపడటం, మీరు భజన చేయడం ఎబ్బెట్టుగా లేదూ?
+ వెన్నుపోటు - నయవంచన - అక్రమాలతో సీఎం అయిన చంద్రబాబు 14 ఏళ్ళపాటు తన కుటుంబం, తన వాళ్ళ కోసమే పనిచేశారు. ఆయనేదో స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడైనట్లుగా కొందరు ఉన్మాదులు ఊగిపోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయనే అందరినీ అవమానాల పాల్జేశారు. హేళనగా చూశారు.
+ సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వ మర్యాదలు.. మినహాయింపులు ఇంకా కొనసాగాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనకు వాతలు పెట్టిన ప్రజలకు ఇవన్నీ ప్రాముఖ్యత లేని అంశాలుగా కనిపిస్తున్నాయి. యువ ముఖ్యమంత్రి తమ పట్ల కనబరుస్తున్న శ్రద్ధ - తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో కొత్త ఆశలు నింపాయి.
+ ఎన్నికల షాక్ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూ-టర్న్. ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఏలో కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది గదా...మోదీ, అమిత్‌షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూ టర్నులు తీసుకున్నా పట్టించుకునే వారుండరు.