Begin typing your search above and press return to search.
దొరికిన జేడీని విజయసాయి రెడ్డి అస్సలు వదల్లేదుగా?
By: Tupaki Desk | 19 April 2019 8:20 AM GMTమంచి ఆకలి మీద ఏం దొరికినా ఆవురావురమంటూ తినేస్తాం. కేసులతో.. తనకున్న పవర్ తో తిప్పలు పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీద జగన్ అండ్ కోకు ఎంత గుర్రుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ.. తనకు అంతగా అవగాహన లేని రాజకీయాల మీద మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు.
ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్న విజయసాయి రెడ్డి వెంటనే స్పందించి ట్విట్టర్ లో విమర్శలతో ఉతికి ఆరేసినంత పని చేశారు. జనసేన సొంతంగా 88 స్థానాల్లో గెలుస్తుందని జేడీ పేర్కొనటంపైన విజయసాయి రెడ్డి స్పందించారు. జనసేన సొంతంగా పోటీ చేసిందే 65 స్థానాలు అయినప్పుడు 88 స్థానాల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.
సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కల్యాణ్ అనుంగ అనుచరుడు జేడీ ఏమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెబుతున్నారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలా లేనివి ఉన్నట్లుగా రాశాడు.. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా? అంటూ ఫైర్ అయ్యారు.
జేడీని ఒక రౌండ్ వేసుకున్న విజయసాయి రెడ్డి.. పనిలో పనిగా బాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా రూపాయి విలువ పడిపోయిందని.. పర్యావరణ పరిరక్షణలో వెనుకబడినట్లు చెప్పి.. దేశంలో అసమానతలు అలానే ఉన్నట్లుగా బాబు సొల్లు వాడుగు వాగాడన్నారు.
పాకిస్థాన్ వాళ్లు పిలిచినా ప్రచారానికి వెళ్లొస్తారంటూ ఫైర్ అయిన ఆయన.. గడిచిన ఐదేళ్లలో ఏపీలోని పంచభూతాలను సైతం హాంఫట్ చేసినట్లుగా మండిపడ్డారు. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని బాబు అండ్ కో సుప్రీంకు చెప్పిందని.. అసెంబ్లీ సెగ్మెంట్ కు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పినా.. వీవీ ప్యాట్లన్నింటిని లెక్కించాలని చెబుతున్న తీరును తప్పు పట్టారు. ఎన్నికలన్నవి ఒక్కడి కోసం కాదని..సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని కూడా బాబు భావించకపోవటం ఏమిటని ఫైర్ అయ్యారు.