Begin typing your search above and press return to search.
విజయసాయిరెడ్డి సంచలనం..కన్నా డేంజర్ లో పడ్డట్టేనా?
By: Tupaki Desk | 21 April 2020 4:47 PM GMTఏపీలో నిన్నటిదాకా వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిన మాటల యుద్ధం ఆసక్తి రేకెత్తిస్తే... ఇప్పుడు కొత్తగా వైసీపీ వర్సెస్ బీజేపీగా మారి తాజా యుద్ధం అమితాసక్తిని రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు. అది కూడా వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి - బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణల మధ్య రేగిన మాటల యుద్ధం ఒక్క రోజులోనే ఓ రేంజికి వెళ్లిపోయింది. కన్నాపై తొలుత సాయిరెడ్డి సంచలన ఆరోపణలు గుప్పిస్తూ దాడి మొదలెట్టగా... ఆ తర్వాత కన్నా కూడా విజయసాయిరెడ్డి పై ఓ రేంజిలో మండిపడ్డారు. తాజాగా కన్నా విసిరిన సవాల్ కు తాను సిద్ధమేనని ప్రతి సవాల్ విసిరిన విజయసాయిరెడ్డి ... మంగళవారం చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తుంటే... కన్నాకు మున్ముందు బ్యాండ్ బాజానేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయినా కన్నాను పూర్తిగా డిఫెన్స్ లో పడేసేలా విజయసాయిరెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘కన్నాపై చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడే ఉన్నా. తెలుగు దేశం పార్టీకి కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుబోయారు. దీనిపై కాణిపాకంలో సాష్టాంగ ప్రమాణానికి నేను సిద్ధం. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చింది? అందులో గుంటూరు కోసం కన్నా ఎంత తీసుకున్నారు? ఎవరెవరికి ఎంత ఇచ్చారు? పురందేశ్వరి ఎంత తీసుకున్నారు? లెక్కలు ఎలా చెప్పారు? ఈ వివరాలన్నీ నా వద్ద ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ అంతర్గత వ్యవహారాలు అయినప్పటికీ కన్నా వ్యవహారం ఏమిటో చెప్పడానికే ఈ వివరాలను ప్రస్తావిస్తున్నా’’ అంటూ విజయసాయిరెడ్డి నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ లెక్కలన్నీ బీజేపీ అంతర్గత వ్యవహారాలేనని చెబుతూనే.. కన్నా వ్యవహారం బయటపెట్టేందుకు ఈ వివరాలను ప్రస్తావిస్తున్నా అంటూ విజయసాయిరెడ్డి అంటున్నారంటే... ఆయన వద్ద ఈ వివరాలేమీ లేకుండా ఉండే సమస్యే లేదన్న వాదన వినిపిస్తోంది. కన్నాతో పాటు బీజేపీ ఏపీ శాఖకు చెందిన మరో కీలక నేత పురందేశ్వరి విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి లాగుతున్నారంటే... బీజేపీకి చెందిన ఏపీ శాఖపై ఆయనకు ఏ మేర కసి ఉందన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధిష్ఠానం ఓ వైపు టీడీపీతో దూరం పాటిస్తుంటే... ఏపీలో బీజేపీ నేతలు టీడీపీతో అంటిపెట్టుకుని తిరుగుతున్న వైనంతోనే విజయసాయిరెడ్డి ఈ రేంజిలో వ్యాఖ్యలు చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా విజయసాయిరెడ్డి చేసిన తాజా సంచలన వ్యాఖ్యలపై కన్నా ఎలా స్పందిస్తారో? అసలు స్పందిస్తారా? అన్న విషయాలపై ఆసక్తికర చర్చకు తెర లేసిందనే చెప్పాలి.