Begin typing your search above and press return to search.
బీజేపీ-టీడీపీ-కాంగ్రెస్ పార్టీలే ముద్దాయిలు
By: Tupaki Desk | 24 July 2018 2:30 PM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి మొదటి ముద్దాయి బీజేపీ - రెండో ముద్దాయి టీడీపీ - మూడో ముద్దాయి కాంగ్రెస్ పార్టీలు అని వైఎస్ ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. హోదా నిందితులను 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగు రీతిలో శిక్షిస్తారని హెచ్చరించారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికే కేబినెట్ తీర్మానం అమల్లో ఉందని చెప్పారు. గత ప్రభుత్వపు తీర్మానాన్ని రద్దు చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తరువాతి ప్రభుత్వాలు గౌరవించాలని ఆయన కోరారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు.
వైఎస్ ఆర్ సీపీ - కమ్యూనిస్టు - జనసేన హోదాను సంజీవని నమ్ముతున్నాయని ఇందుకు భిన్నంగా ప్రత్యేక హోదా సంజీవని కాదని టీడీపీ చెప్పిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. హోదా కోసం గత నాలుగేళ్లుగా వైఎస్ ఆర్ సీపీ పోరాడుతోందని చెప్పారు. వైసీపీకి మైలేజీ వస్తుందని భావించి టీడీపీ మాటమార్చిందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. ఏపీకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తరువాతి ప్రభుత్వాలు గౌరవించాలన్నారు.
కాగా, విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మైక్ కట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరిస్తుండగా సమయం అయిపోయిందని తెలిపారు. దీంతో టీడీపీకి 27 నిమిషాలు సమయం ఇచ్చారని తనకు కనీసం 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించాలని విజయసాయిరెడ్డి కోరారు. అయినప్పటికీ వెంకయ్యనాయుడు నిరాకరించి మైక్ కట్ చేశారు.