Begin typing your search above and press return to search.
కేంద్రం మాట..పోలవరంలో అదనపు చెల్లింపులు నిజమే!
By: Tupaki Desk | 2 Dec 2019 5:19 PM GMTనవ్యాంధ్రప్రదేశ్ జీవనాడిగా పరిగణిస్తున్న జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు పోలవరం నిర్మాణం.. టీడీపీ అధినేత - మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ఉత్తిత్తిదేమీ కాదని మరోమారు తేలిపోయింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని దాదాపుగా అన్ని వర్గాలు గట్టిగానే నమ్ముతున్న వేళ... ఈ మాట అక్షరాలా నిజమేనంటూ ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోమారు బల్ల గుద్ది మరీ చెప్పింది. అంతేకాకుండా బాబు భాగోతంపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని - ఈ దందాపై చర్యలు తప్పవని కూడా మోదీ సర్కారు తేల్చి చెప్పింది. పోలవరంలో బాబు మార్కు అవినీతిని ఇలా కేంద్రం బల్ల గుద్ది చెప్పేలా వైసీపీ ప్రధాన కార్యదర్శి - ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఈ వ్యవహారం అసలు వివరాల్లోకి వెళితే... పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ప్రాజెక్టును తామే నిర్మించి ఇస్తామని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే నిధులు ఇస్తే చాలు... ప్రాజెక్టును మేమే కట్టుకుంటామంటూ చంద్రబాబు తనదైన శైలి రాయబారం నడిపారు. నాడు బీజేపీతో టీడీపీకి దోస్తానా ఉండటంతో బాబు మాటకు మోదీ ఓకే చెప్పేశారు. ఇంకేముంది... కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర శాఖల నిధులను కూడా మళ్లించేసిన చంద్రబాబు... పోలవరం కాంట్రాక్టరు అడిగిందే తడవుగా నిధులను ఇచ్చేశారు. ఇందులో చేసిన పనులకు మాత్రమే బిల్లులు మంజూరు చేశారంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే... పోలవరం కాంట్రాక్టరుకు చంద్రబాబు సర్కారు మంజూరు చేసిన బిల్లుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు, అవి లేటయ్యాయన్న కారణం చూపి వాటికి వడ్డీలు కూడా ఉన్నాయట.
ఈ విషయంపై ఇప్పటికే కేంద్రం వద్ద సమాచారం ఉండగా... తాజాగా విజయసాయిరెడ్డి రెడ్డి సంధించిన ఓ ప్రశ్నకు కేంద్రం ఈ వ్యవహారంపై క్లిస్టర్ క్లియర్ గా ప్రకటన చేయక తప్పలేదు. సాయిరెడ్డి సంధించిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రతన్ లాల్ కటారియా పోలవరం కాంట్రాక్టరుకు బాబు సర్కారు నిధులను ఎలా ఇచ్చిందన్న పూర్తి వివరాలను చెప్పక తప్పలేదు. సరే.. మరి కేంద్రం మాటల్లో పోలవరం కాంట్రాక్టరుకు బాబు ఎలా నిధులు ఇచ్చారన్న విషయానికి వస్తే... పోలవరం కాంట్రాక్టరుకు తాను చేసిన పనుల బిల్లులకు అదనంగా రూ.2346 కోట్లను బాబు సర్కారు అందించిందట.పోలవరం ప్రాజెక్ట్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి జూలై 2019లో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపిందట.
ఈ నివేదిక ప్రకారం 2015-16 సంవత్సరంలో ప్రాజెక్ట్ కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపి కాంట్రాక్టర్లకు అదనంగా రూ.1331 కోట్లు చెల్లించింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ లపై వడ్డీ కింద రూ.84.43 కోట్లు - అడ్వాన్స్ కింద రూ.144.22 కోట్లు - జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ పనులు అప్పగించడానికి ముందుగానే అడ్వాన్స్ కింద రూ.787 కోట్లను బాబు సర్కారు విడుదల చేసిందట. అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాధమికమైనవని గత నవంబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు కటారియా చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాలలో విధానపరమైన అతిక్రమణలు లేవని, సంబంధిత అధికారుల ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం జరుగుతుందని చెప్పారు.