Begin typing your search above and press return to search.
బాబు తిన్న 2636 కోట్లు కక్కిస్తాం
By: Tupaki Desk | 28 Jun 2019 10:39 AM GMTవైసీపీ తరుఫున ఎవ్వరూ గళమెత్తినా.. ఎత్తకున్నా.. తన ట్విట్టర్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రతిపక్ష టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా ప్రజావేదికను కూల్చి చంద్రబాబు నివాసం అక్రమం అంటూ జగన్ ప్రభుత్వం నోటీసులు అందించిన విషయంపై ఆయన స్పందించారు. టీడీపీని, దాని అనుకూల మీడియా అభూతకల్పనలను ట్విట్టర్ ద్వారా ఏకిపారేశారు.
ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు ఇంటికి నోటీసులపై చంద్రబాబు పల్లకీ మోసే మీడియా మళ్లీ మొదలు పెట్టిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేత అక్రమం అంటూ టీడీపీ మీడియా ఘోషిస్తున్నాయని.. సీఆర్డీఏ, ఎన్జీటీ, నదీపరిరక్షణ చట్టం-1884 లాంటి చట్టాలను చదవాలని.. సూచించారు. బాబు అక్రమంగా నిర్మించిన కట్టడం బాబు కుల మీడియాకు చారిత్రక కట్టడంలా కనిపిస్తోందా అని మండిపడ్డారు.
ఇక ప్రజావేదిక కూల్చివేతను రాద్ధాంతం చేస్తున్న టీడీపీ నేతలకు విజయసాయిరెడ్డి చురకలంటించాడు. ఈ వేదికను నెటిజన్లు ‘గణేష్ మండపానికి ఎక్కువ.. కోళ్ల షెడ్డుకు తక్కువగా’ ఎద్దేవా చేస్తున్నారని సెటైర్ వేశారు. చంద్రబాబు ప్రభుత్వం 9 కోట్లు బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
చంద్రబాబు విద్యుత్ కొనుగోళ్లలో భారీ గోల్ మాల్ చేశాడని.. అక్రమంగా కొందరికి లబ్ధి చేకూర్చాడని.. 2636 కోట్ల చెల్లింపులను అక్రమంగా చేశాడని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాధానాన్ని కక్కిస్తామంటూ బాబుకు హెచ్చరికలు పంపారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలు బాబును అవినీతి విషయంలో సమర్థించడం తప్ప చేస్తుంది ఏమీలేదని ఎద్దేవా చేశారు.