Begin typing your search above and press return to search.

అప్డేట్ కాకుండా ప‌రువు తీస్తున్నావే య‌న‌మ‌ల‌?

By:  Tupaki Desk   |   26 Jun 2019 8:12 AM GMT
అప్డేట్ కాకుండా ప‌రువు తీస్తున్నావే య‌న‌మ‌ల‌?
X
తెలివైనోడ్ని అనుకోవ‌టానికి మించిన త‌ప్పుడు ప‌ని మ‌రొక‌టి ఉండ‌దు. తెలివి ఏ ఒక్క‌రి సొత్తు కాదు. నేను పోటుగాడ్ని.. తెలివైనోడ్ని అన్న భావ‌న మ‌న‌సు వ‌చ్చేసిందంటే చాలు.. అప్డేష‌న్ ఆగిపోతుంది. దాంతో వ‌చ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తెలివి త‌మకు మాత్ర‌మే సొంత‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తెలుగు త‌మ్ముళ్ల‌కు ఇప్పుడీ స‌మ‌స్య ట‌న్నుల ట‌న్నుల కొద్దీ ఉంది.

ప్ర‌తి విష‌య‌మూ త‌మ‌కే బాగా తెలుస‌న్న అహంకారంతో ఉండే నేత‌ల‌కు తెలుగుదేశంలో కొద‌వ లేద‌న్న మాట త‌ర‌చూవినిపిస్తూ ఉంటుంది.అలాంటి వారి జాబితాలో య‌న‌మ‌ల పేరు ప్ర‌ముఖంగా చెబుతుంటారు. విష‌యం ఏదైనా స‌రే.. త‌గ‌దున‌మ్మా అంటూ ముందుకొచ్చే అయ్య‌గారి కార‌ణంగా ఇప్ప‌టికే పోవాల్సిన ప‌రువు పోగా.. ఇప్పుడు మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితికి కార‌ణ‌మ‌వుతున్నారంటున్నారు తెలుగుత‌మ్ముళ్లు.

ప్ర‌జావేదిక కూల్చివేత‌పై తాజాగా య‌న‌మ‌ల స్పంద‌న ఆయ‌న అడ్డంగా దొరికిపోవేట‌మేకాదు.. ఇంత బాధ్య‌తారాహిత్యంతో మాట్లాడ‌తారా? అంటూ తిట్టేస్తున్నారు ప‌లువురు. చేసింది ఎద‌వ ప‌ని కాకుండా.. త‌ప్పును త‌ప్పుగా చూపించిన‌ప్పుడు మౌనంగా ఉండాల్సింది పోయి మాట్లాడ‌టం కూడానా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

ప్రజావేదిక ఇష్యూలో బాబు అడ్డంగా బుక్ అయిపోయార‌ని.. అలాంటివేళ మౌనంగా ఉండ‌టం మంచిద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తోంది. య‌న‌మ‌ల లాంటోళ్ల మాట‌ల‌కు క‌ర్ర‌కాల్చి వాత పెట్టే విజ‌య‌సాయి రెడ్డి లాంటి నేత‌లు ఉండ‌నే ఉన్నారు. తాజాగా ఆయ‌న ట్వీట్ట‌ర్ సాక్షిగా ట్వీట్ చేసి పంచ్ ఇచ్చారు. ప్ర‌జావేదిక కూల్చివేత తుగ్ల‌క్ చ‌ర్య అన్న య‌న‌మ‌ల‌కు క‌డుపు నిండిపోయేలా వ్యాఖ్య చేశారు.

రివ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ యాక్ట్ ను ఒక్క‌సారి చ‌ద‌వండి య‌న‌మ‌ల గారూ.. ఎవ‌రు తుగ్ల‌కో తెలుస్తుంది.. న‌దీ తీరాన్ని పూడ్చి క‌ట్టిన నిర్మాణాల‌ను తొల‌గించాల‌ని డిమాండు చేయాల్సింది పోయి కాపాడాల‌ని అడ్డుప‌డ‌టం వింత‌గా ఉంది.. ప్ర‌కృతి వ‌న‌రుల‌ను ధ్వంసం చేసినందుకే క‌దా ప్ర‌జ‌లు మీకు వాత‌లు పెట్టి త‌రిమేశారంటూ గ‌ట్టి ట్వీట్ పంచ్ ఇచ్చారు. అందుకే అనేది.. య‌న‌మ‌ల లాంటి నేత‌లు కాస్త అప్డేట్ అయితే మంచిది లేదంటే.. విజ‌యసాయి లాంటి పుల్లీ లోడెడ్ అప్డేట్ వెర్ష‌న్ దెబ్బ‌కు ప‌దే ప‌దు ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వు.