Begin typing your search above and press return to search.
బాబుకు చావు తప్పి కన్ను లొట్టపోయింది!
By: Tupaki Desk | 12 Dec 2018 7:33 AM GMTకాంగ్రెస్ - టీడీపీ కూటమి తెలంగాణలో ఘోర పరాజయం పాలవ్వడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆనంద డోలికల్లో మునిగిపోతున్నాయి. వైసీపీ కార్యకర్తలు - నేతలకు టీడీపీ ఓటమి ఓటమి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఇలాంటి చేదు ఫలితాలు తప్పవని జోస్యం చెప్తున్నారు.
తెలంగాణలో టీడీపీకి ఎదురైన పరాభవంపై వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి తాజాగా ట్విట్టర్ లో స్పందించారు. తెలంగాణ ప్రజల తీర్పుతో టీడీపీ గుర్తు అయిన సైకిల్ ముందు చక్రం ఊడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లు వదిలేసిన రెండో చక్రాన్ని కూడా పీకేసి చంద్రబాబు పీడను త్వరగా వదిలించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బాబుకు చావు తప్పి కన్ను లొట్టపోయిందంటూ ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు భాగస్వామిగా ఉంటే ఎలాంటి కూటమైనా సరే విష కూటమిగా మారుతుందని విజయసాయి విమర్శించారు. ఆయనతో జత కట్టడం వల్లే తెలంగాణలో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయిందంటూ చురకలంటించారు. బాబుది ఐరన్ లెగ్ అని అభివర్ణించారు. వచ్చే ఎన్నికలతో ఏపీకి ఆయన పీడ విరగడవ్వడం ఖాయమని పేర్కొన్నారు. మరోవైపు - తెలంగాణలో టీఆర్ ఎస్ విజయాన్ని హర్షిస్తూ ఏలూరులో వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచారు.