Begin typing your search above and press return to search.
బాలయ్య సంభ్రమాశ్చర్యం.. విజయ్ సాయిరెడ్డి పంచ్
By: Tupaki Desk | 19 Nov 2018 10:42 AM GMTతెలుగులో డైలాగులు బాగా చెప్పే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. సినిమాల్లో బట్టీ పట్టిన డైలాగుల్ని అనర్గళంగా పలుకుతుంటాడాయన. ఐతే అక్కడ ఏదైనా తడబాటు వచ్చినా.. మళ్లీ ఇంకో టేక్ తీసుకోవచ్చు. పర్ఫెక్టుగా డైలాగ్ వచ్చే వరకు టేక్స్ మీద టేక్స్ చేయొచ్చు. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు. డైలాగుల్ని ఎంత బట్టీ పట్టినా మైకు పట్టుకుని మీడియా ముందు మాట్లాడేటపుడు తేడా కొట్టేస్తుంటుంది. ఈ క్రమంలో బాలయ్య ఎన్నిసార్లు నవ్వుల పాలయ్యాడో లెక్కే లేదు. కొన్నేళ్ల కిందట ప్రత్యేక హోదా గురించి బాలయ్య మీడియాకు ఇచ్చిన వివరణ తాలూకు వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. ఎప్పుడు మీడియాను కలిసిన తన మాట తడబాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకోవడానికి కంటెంట్ ఇచ్చి వెళ్తుంటాడు బాలయ్య.
తాజాగా హరికృష్ణ తనయురాలు సుహాసినితో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాలయ్య అన్న మాట జనాలకు పెద్ద షాకే ఇచ్చింది. హరికృష్ణ మరణం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని బాలయ్య అనడం పెద్ద చర్చకే దారి తీసింది. ‘దిగ్భ్రాంతి’ లాంటి పదం వాడాల్సిన చోట పాజిటివ్ వర్డ్ వాడాడు. దాన్ని కూడా ‘సంబరం.. ఆశ్చర్యం’ అని విడగొట్టి మాట్లాడాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో ఆల్రెడీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు జనాలు. తాజాగా దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయుడు.. ఎంపీ విజయ్ సాయిరెడ్డి కూడా స్పందించారు. ‘‘మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరం తో కూడిన ఆశ్చర్యం కలిగించిందా? అవును, తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా. కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా? నిజమే మాట్లాడావా బాలయ్యా.” అని ట్విట్టర్లో ఆయన పంచ్ విసిరారు.