Begin typing your search above and press return to search.
బాబు-లోకేష్ లు ఓటమి భయంలో ఇలా చేస్తున్నారా?
By: Tupaki Desk | 20 March 2019 7:18 AM GMTఏపీ సీఎం కుమారుడు - మంత్రి నారా లోకేష్ పై మరోసారి ట్విట్టర్ లో సెటైర్లు కురిపించారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. మంగళగిరిలో నారా లోకేష్ గెలుపుపై టీడీపీ అధినేత చంద్రబాబుకు - ఆయన కుమారుడు లోకేష్ కు కూడా నమ్మకం లేదని.. అందుకే ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా లోకేష్ పోటీ చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగిద్దామనే బాబు ఈ ప్లాన్ చేశారని సెటైర్ వేశారు..
టీడీపీ ఎమ్మెల్సీలుగా చేస్తున్న నారాయణ - సోమిరెడ్డి లాగా కొడుకును ఎందుకు రాజీనామా చేయించలేదో చంద్రబాబు చెప్పాలని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఇక టీడీపీ-జనసేన రహస్య ఒప్పందంపై కూడా విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. క్విడ్ ప్రోకో పద్ధతిలో జనసేన - టీడీపీ పంచుకుంటున్నాయని మండిపడ్డారు. జేడీ లక్ష్మీనారాయణ విషయంలో ఇది నిరూపితమైందని.. వారి మధ్య డీల్ కుదిరే టీడీపీలో చేరాల్సిన జేడీ జనసేనలో చేరాడని ఆరోపించారు. వారి ఇద్దరి ప్రత్యర్థి వైఎస్ జగనేనన్నారు.
ఇక మరో ట్వీట్ లో జనసేన టీడీపీ పొత్తుపై ట్వీట్ లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ‘అలెగ్జాండర్ భారత్ దండయాత్రలో ఒక విలన్ ఉన్నాడని.. పురుషోత్తముడిపై కోపంతో తక్షశిల రాజు అంభి - అలెగ్జాండర్ తో చేతులు కలిపి జీలం యుద్ధంలో పురుషోత్తముడి ఓటమికి కారకుడయ్యాడని మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ జగన్ ను దొంగ దెబ్బ కొట్టడానికి చంద్రబాబు అభినవ అంభితో ప్యాకేజీ మాట్లాడుకున్నారని’ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. యుద్ధాలు - దండయాత్రలతో విసిగిపోయిన గ్రీకు సైన్యం అలెగ్జాండర్ ను ధిక్కరించినట్టే.. చంద్రబాబుతో విసిగిన టీడీపీ నేతలు - ప్రజలు ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలో కొంప ముంచబోతున్నారని కౌంటర్ ఇచ్చారు.అభినవ అలెగ్జాండర్ చంద్రబాబుకు ఈ పాటికే ఈ విషయం అర్థమైందన్నారు.
25 ఎంపీ స్థానాల్లో వైఎస్ జగన్ సీట్లకు బీసీ అభ్యర్థులను నిలబెడితే.. ఈ బీసీలే మాకు వెన్నుముక అని చెప్పుకుంటున్న బాబు మాత్రం వారికి 5 సీట్లే కేటాయించారని విజయసాయి విమర్శించారు. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నది ఎవరో దీన్ని బట్టి తెలుస్తోందన్నారు.