Begin typing your search above and press return to search.

కుక్కలను తరిమాక మీకు బడిత పూజే!

By:  Tupaki Desk   |   31 Aug 2019 11:07 AM GMT
కుక్కలను తరిమాక మీకు బడిత పూజే!
X
వైసీపీ ఎంపీ - ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శల డోసు భారీగా పెంచారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలను - వెనుకుండి నడిపిస్తున్నది చంద్రబాబు అంటూ ఉతికి ఆరేశారు. కఠినమైన - కటువైన పదాలతో తిట్టిపోశారు.

ట్విట్టర్ లో తాజాగా వరుస ట్వీట్లతో చంద్రబాబు - లోకేష్ - టీడీపీ నేతలను చెడుగుడు ఆడేశారు విజయసాయిరెడ్డి.. ఇసుక మాఫియా పై జగన్ నిషేధంతో కలుగులోంచి బయటపడ్డ ఎలుకలా చంద్రబాబు - టీడీపీ నేతలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దీనిపై కార్మికులు ఉపాధి పోయిందని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు.

అమరావతిని వరద ముంచినప్పటి నుంచి చంద్రబాబు దెయ్యంపట్టిన వాడిలా మారిపోయాడని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన బినామీలు - బంధువర్గం గురించే ఈ బాధ అంతా అని దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా చంద్రబాబు తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారని విమర్శించారు.

ఇక మరో ట్వీట్ లో ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలను తండ్రీ కొడుకులు వదిలేశారని.. అవి దారినపోయే వాళ్ల వెంటపడుతున్నాయని.. ఉస్కో అంటే మొరుగుతున్నాయని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆ కుక్కలను తరిమికొట్టి తర్వాత మీకు బడితే పూజ తప్పదంటూ హెచ్చరించారు విజయసాయిరెడ్డి. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు - నారా లోకేష్ లను ట్యాగ్ చేయడం విశేషం.

ఇలా విమర్శల వాడి పెంచిన విజయసాయిరెడ్డి మాటల తూటాలు పేల్చారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న టీడీపీ నేతల గుట్టుపై కడిగిపారేశారు.