Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?

By:  Tupaki Desk   |   6 Jun 2019 6:40 AM GMT
చంద్రబాబుకు ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?
X
టీడీపీ అధినేత‌ - ఏపీ అసెంబ్లీలో కొత్త‌గా విప‌క్ష నేత‌గా ఎంపికైన నారా చంద్ర‌బాబునాయుడు సీఎం హోదాలోకి వెళ్లి కూర్చున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాసిన లేఖ నిన్నంతా వైర‌ల్ గా మారిపోయింది. ప్ర‌జా వేదిక‌ను ఉప‌యోగించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ జ‌గ‌న్ కు చంద్ర‌బాబు లేఖ రాస్తే... ఆ లేఖ‌పై జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారంటూ నిన్నంతా పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి. తాజాగా నేటి ఉద‌యం ఆ విశ్లేషణ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టేస్తూ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ నేతగా కొత్త బాధ్య‌త‌ల్లోకి వెళ్లిపోయిన వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్ చేశారు.

చంద్ర‌బాబు లేఖ‌లోని అస‌లు విష‌యం ఇదేనంటూ సాయిరెడ్డి సెటైరిక‌ల్ గా చేసిన కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయింది. విప‌క్ష నేత హోదాలో చంద్ర‌బాబు... సీఎం జ‌గ‌న్‌ కు రాసే తొలి లేఖ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే ఉంటుంద‌ని తాను అనుకున్నాన‌ని అయితే... అందుకు విరుద్ధంగా చంద్ర‌బాబు త‌న ల‌గ్జరీ హోం కోస‌మే లేఖ రాశార‌ని విజ‌య‌సాయిరెడ్డి అదిరిపోయే పంచ్ సంధించారు. నేటి ఉద‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబును టార్గెట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి... చంద్ర‌బాబును ఓ ఆటాడుకున్నార‌నే చెప్పాలి. బాబు రాసిన లేఖ‌ను ఆధారం చేసుకుని అమ‌రావ‌తిలో అస‌లు సొంతిల్లు క‌ట్టుకునే యోచ‌న బాబుకు లేన‌ట్టుందే అంటూ మ‌రింత‌గా గిల్లేశారు.

అయినా విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్వీట్ లో ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా - పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?" అని ఆ ట్వీట్ లో చంద్ర‌బాబును విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తంగా జ‌గ‌న్ కు బాబు రాసిన లేఖ ఎటు పోయిందో గానీ.. చంద్ర‌బాబుకు సంబంధించిన కొత్త అంశాల‌ను బ‌య‌ట‌పెట్టేసిన విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్వీట్ తో మ‌రోమారు టీడీపీని ఇరుకున పెట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.