Begin typing your search above and press return to search.
బాబుని ఒక ఆట ఆడుకున్న విజయ సాయి రెడ్డి
By: Tupaki Desk | 13 Nov 2018 7:26 AM GMTపాలనలో విషయం లేనపుడు మాటలతో మాయ చేయడం మినహా చంద్రబాబుకు వేరే మార్గం కనపడినట్టు లేదు. మీడియా మేనేజ్‌మెంట్ లో డబుల్ పీహెచ్ డీ చేసిన చంద్రబాబు ఎక్కడ సాయం చేసినా ఆ సాయానికి ఖర్చుపెట్టిన దాని కంటే ఎక్కువ ఖర్చుపెట్టి దానిని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. దానికి తాజా ఉదాహరణ తిత్లీ తుపాను సాయం. చంద్రబాబు అక్కడ చేసిన సాయం వంద కోట్లు. కానీ ప్రచారానికి పెట్టిన ఖర్చు 200 కోట్లకు పైనే అని ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు మాయ మాటలపై విసిగి వేసారిన విజయ సాయి రెడ్డి తాజాగా మంచి చెణుకులతో బాబుపై వ్యంగాస్త్రాలు విసిరారు.
*రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుపాన్ లను ఒంటి చేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడు బాబు’ అని విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఇటీవల తిత్లీ తుఫాను విషయంలో నేను సముద్రాన్ని కంట్రోల్ చేశానని చెప్పిన విషయంపై సోషల్ మీడియా బాబును బాగా ఆడుకుంది. అయితే, అంతకుముందు కూడా ఇలాంటి మాటలే మాట్లాడు అంటూ విజయ సాయి రెడ్డి వ్యంగంగా వ్యాఖ్యానించారు. అంతేనే చంద్రబాబు ప్రలోభాలకు ఆదిగురువు అట.
కుల వృత్తులలో మెజారిటీ ప్రజలు బీసీలేనని - వారి కోసం నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకాన్ని చంద్రబాబు అటకెక్కించడంపై విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. గతంలో పచ్చ చొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి.. కుల వృత్తుల వారికి పనిముట్లు పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలుపెట్టారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబు సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు.