Begin typing your search above and press return to search.
మోడీతో బాబు లివ్ ఇన్ రిలేషన్ షిప్..బోర్ కొట్టాడని మార్చేశాడు
By: Tupaki Desk | 18 Nov 2018 1:25 PM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఎదురుదాడి చేయడంలో ముందుండే వైఎస్ ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా మరోమారు అదే తరహాలో బాబును టార్గెట్ చేశారు. ఇటు ఆన్ లైన్ లో అటు ఆఫ్ లైన్ లో చంద్రబాబు కలవరపాటుకు గురయ్యేలా వ్యవహరించారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన విజయ సాయి రెడ్డి ఈ సందర్భంగా సినీనటుడు - శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎం.మోహన్ బాబును ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిశారు. ఇటీవల మృతి చెందిన మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ చిత్ర పటానికి నివాళులర్పించి మోహన్ బాబును పరామర్శించారు. దీంతో కలవరపాటుకు గురవడం టీడీపీ వర్గాల వంతు అయింది.
దీనికి కొనసాగింపుగా విజయ సాయి రెడ్డి ఓ కీలక ట్వీట్ చేశారు. ``చంద్రబాబూ...నాలుగేళ్లు మీ బాయ్ ఫ్రెండ్ బీజేపీ మోదీ గారితో లివ్-ఇన్ రిలేషన్ షిప్ చేసి - బోర్ కొట్టాడని పార్టనర్ ను మార్చిందెవరు పప్పు లోకం? క్యారక్టర్ లేని బతుకు మీది. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న జగన్ గారిని తప్పుబడతారా? రాజకీయ బ్రోకర్లకు అందరూ అలాగే కనిపిస్తారు`` అంటూ విరుచుకుపడ్డారు. అంతకుముందు ట్వీట్ లో సైతం బాబును టార్గెట్ చేశారు. ``ప్రజలకు మేలు చేయకపోగా వారిని దగా చేసి AP ని లూటీ చేసిన వాడిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతాడు. బాబు మీద ఒక మాన్యువల్ వస్తుంది. రాజకీయాలలో ప్రవేశించేవారికి అది కరదీపిక అవుతుంది. రాజకీయ నేతగా రాణించాలంటే నాయుడుబాబు చేసిన తప్పిదాలు చేయకుండా ఆ కరదీపిక ఎంతో ఉపకరిస్తుంది`` అంటూ విరుచుకుపడ్డారు. విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.