Begin typing your search above and press return to search.

నారా పవన్‌ రాహుల్‌ నాయుడు - టైటిల్‌ అదిరింది

By:  Tupaki Desk   |   2 Jan 2019 10:02 AM GMT
నారా పవన్‌ రాహుల్‌ నాయుడు - టైటిల్‌ అదిరింది
X
చంద్రబాబుని టార్గెట్‌ చేస్తూ తన పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఎన్నికల దగ్గరపడుతున్న వేళ.. తన విమర్శల వేడిని మరితంగా పెంచారు ఆయన. ఇన్నాళ్లూ పవన్‌ని దూరం పెట్టిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఆయన మద్దతు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. అసలు చంద్రబాబు నాయుడు పేరుని “నారా పవన్‌ రాహుల్‌ నాయుడు” అని మార్చుకుంటే బావుంటుందని ఎద్దేవా చేశారు. గతంలో పవన్‌ని పెళ్లి చేసుకుని - విడాకులు తీసుకుని విడిపోయి.. మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన విజయసాయిరెడ్డి గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. వేరే పార్టీల్లోకి తన పార్టీ వారిని పంపి వారిని కోవర్టులుగా వాడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇప్పుడు టీఆర్‌ ఎస్‌ లోకి ఇద్దరు ఎమ్మెల్యేల్ని పంపుతున్నారని అన్నారు. జనసేనలో కూడా చంద్రబాబు కోవర్టులున్నారని.. వారంతా కలిసి పవన్‌ కల్యాణ్‌ ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. మొత్తానికి వెరైటీ విమర్శలతో చంద్రబాబుని ఇరుకున పెడుతున్నారు విజయసాయిరెడ్డి.